టీ20 ప్రపంచ కప్: 95 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. ఇంగ్లండ్ ఘన విజయం
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:26 PM
పల్లెకెలె స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు.. 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. పల్లెకెలె స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు.. 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటయ్యారు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రీలంక కెప్టెన్ శనక(30) టాప్ స్కోరర్.
దునిత్ వెల్లలాగే(10), మెండీస్(13), తీక్షణ(10) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3, జోఫ్రా ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో 2, జెమీ 1 వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ సాల్ట్(62) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విల్ జాక్స్(21), హ్యారీ బ్రూక్(14) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. లంక బౌలర్లలో వెల్లలాగే 3, మదుశంక, తీక్షణ తలో 2, చమీరా 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్