Share News

తన కొడుకుకు రూ.4కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:34 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య.. తన కొడుకు అగస్త్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా. ముంబైలోని ఓ కార్ల షోరూమ్ అగస్త్యకు కారు కీని అందించింది.

తన కొడుకుకు రూ.4కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన హార్దిక్ పాండ్య
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా అతడు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన కొడుకుకు హార్దిక్ పాండ్య ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఐదేళ్ల అగస్త్యకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్‌గా అందించాడు. దీని విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా. ముంబైలోని ఓ కార్ల షోరూమ్ అగస్త్యకు కారు కీని అందించింది. అయితే ఈ సమయంలో అగస్త్య తల్లి, హార్దిక్ పాండ్య మాజీ భార్య నటాషా పక్కనే ఉండటం విశేషం.


దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే 2020లో నటాషాను హార్దిక్ పాండ్య పెళ్లి చేసుకున్నాడు. 2024లో విడాకులు తీసుకున్నట్లు ఇరువురు ప్రకటించారు. అధికారికంగా విడిపోయిన తర్వాత కూడా హార్దిక్-నటాషా జంట తమ కుమారుడి విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. కో పేరెంటింగ్‌లో వారు చూపుతున్న సమన్వయం నెటిజన్లను మెప్పిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల హార్దిక్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన విషయం తెలిసిందే. మోడల్ మహికా శర్మతో రిలేషన్‌లో ఉన్నట్టు పాండ్య అధికారికంగా వెల్లడించాడు. మరోవైపు నటాషా కూడా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తోంది.


ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 22 , 2026 | 04:35 PM