Share News

టీ20 ప్రపంచకప్: భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వాన గండం ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే..

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:22 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...

టీ20 ప్రపంచకప్: భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వాన గండం ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే..
IND vs SA

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్( World Cup 2026)లో గ్రూప్ దశ మ్యాచులు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. పసికూన జట్లు బలమైన జట్లను ఓడించినంత పనిచేశాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా, శ్రీలంక టీమ్‌లను ఓడించి సూపర్ 8కి అర్హత సాధించింది. గ్రూప్ స్టేజ్ మాదిరిగానే సూపర్ 8 రసవత్తరంగా ఉంటుందని క్రికెట్ ప్రియులు భావించారు. అయితే నిన్న సూపర్ 8 రౌండ్ నిరాశజనకంగా ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 21) పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.


తదుపరి మ్యాచ్‌లకూ వర్షం అంతరాయం కలిగిస్తుందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇవాళ(ఆదివారం) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‪కు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని కొలంబో వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో ఇవాళ సాయంత్రం 7:00 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా(Ind Vs SA) జట్లు కూడా అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. భారత్, ప్రొటీస్ జట్ల మ్యాచ్‪కు వాన ముప్పు లేదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం లేదని, వాతావరణం పూర్తి పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు.


పిచ్ రిపోర్ట్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే.. మైదానం పెద్దదిగా ఉండటం వల్ల బ్యాటర్లు.. బంతిని బౌండరీ దాటించాలంటే శ్రమించాల్సిందే. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేస్తే, ఛేదన సులువవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచు ప్రభావం ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 22 , 2026 | 01:59 PM