మహిళల ఆసియా కప్ ఫైనల్: బంగ్లా చిత్తు.. భారత్‌దే టైటిల్
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:00 PM
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత ఏ మహిళలు అద్భుతం చేశారు. బ్యాంకాక్ వేదికగా బంగ్లాదేశ్ ఏతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 135 పరుగుల ఛేదనలో బంగ్లా.. 88 పరుగులకే ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత ఏ మహిళలు అద్భుతం చేశారు. బ్యాంకాక్ వేదికగా బంగ్లాదేశ్ ఏతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఆరంభంలో యూఏఈపై ఓటమి తర్వాత వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచిన టీమిండియా మహిళలు ఎట్టకేలకు ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడనున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేశారు. తేజాల్(51*) హాఫ్ సెంచరీతో అజేయంతో నిలిచింది. కెప్టెన్ రాధా యాదవ్(36), వ్రింద దినేశ్(19) రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో ఫాతిమా 4 వికెట్లతో అదరగొట్టింది. ఫర్జానా, సోనియా తలొక వికెట్ పడగొట్టారు.
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఏ బ్యాటర్లు తడబడ్డారు. ఆదిలో కాస్త దూకుడుగానే ఆడినా.. ఆఖరి వరకు దాన్ని కొనసాగించలేకపోయారు. షామీమా సుల్తానా(20) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు. 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో ప్రేమ రావత్ 3, సోనియా, తనూజ చెరో 2, సైమా, మన్ను మణి, రాధా యాదవ్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్