రాణించిన మిల్లర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:51 PM
టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ డేవిడ్ మిల్లర్ సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది.
టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ డేవిడ్ మిల్లర్ సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. టీమిండియా ఎదుట 188 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది (India vs South Africa).
తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ డికాక్ (6)ను బుమ్రా ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ మార్‌క్రమ్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్ చివరి బంతికి రికెల్టన్‌ను బుమ్రా అవుట్ చేశాడు. దీంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆ దశలో డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63), బ్రావిస్ (29 బంతుల్లో 45) దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించారు (India need 188 runs).
బ్రావిస్ అవుట్ అయినా మిల్లర్ మాత్రం జోరు కొనసాగించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు (SA vs IND match update). 150 పరుగుల లోపే దక్షిణాఫ్రికా అవుట్ అవుతుందనుకుంటే.. మిల్లర్ జోరుతో భారీ స్కోరు సాధించింది. చివర్లో స్టబ్స్ (44 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి, ఈ భారీ టార్గెట్‌ను టీమిండియా బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి.