Share News

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Feb 22 , 2026 | 06:34 PM

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
T20 World Cup Super 8

Live News & Updates

  • Feb 22, 2026 22:38 IST

    సూపర్ 8: టీమిండియా ఓటమి

    • 76 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం

    • 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 111కే పరిమితం

    • 18.5 ఓవర్లలో 111 పరుగులకు భారత్ ఆలౌట్

    • దూబే(42) టాప్ స్కోరర్

    • యాన్సెన్‌కు 4 వికెట్లు

    • కేశవ్ మహరాజ్ 3, బాష్ 2, మార్క్‌రమ్ 1 వికెట్

    • సూపర్ 8లో తొలి విజయాన్ని నమోదు చేసిన సౌతాఫ్రికా

  • Feb 22, 2026 22:35 IST

    111 పరుగులకు భారత్ ఆలౌట్

    • యాన్సెన్‌కు మరో వికెట్

    • మార్క్‌రమ్‌కు క్యాచ్ ఇచ్చిన బుమ్రా(0)

  • Feb 22, 2026 22:33 IST

    దూబే(42) ఔట్

    • యాన్సెన్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి ఎంగిడికి క్యాచ్ ఇచ్చిన దూబే(42)

    • 111 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • Feb 22, 2026 22:32 IST

    దూకుడు పెంచాల్సిందే..

    • ఓటమి అంచున టీమిండియా

    • ఎంగిడి వేసిన 18వ ఓవర్లో వచ్చిన పరుగులు కేవలం 3

    • క్రీజులో వరుణ్ చక్రవర్తి(0), దూబే(36)

    • టీమిండియా విజయానికి 12 బంతుల్లో 83 పరుగులు అవసరం

    • ప్రస్తుతం స్కోర్ 105/8

  • Feb 22, 2026 22:23 IST

    దూబే దూకుడు

    • రబాడా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన దూబే(32)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 13

    • ఐదో బంతికి క్యాచ్ డ్రాప్ చేసిన మిల్లర్.. దూబేకి లైఫ్

    • 16 ఓవర్లకు టీమిండియా స్కోర్ 101/8

  • Feb 22, 2026 22:18 IST

    వరుస వికెట్లు.. అర్ష్‌దీప్ సింగ్ ఔట్

    • ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన కేశవ్ మహరాజ్

    • మూడు క్యాచ్‌లను తీసుకున్నది స్టబ్స్

    • అర్ష్‌దీప్ సింగ్(1) ఔట్

    • 88 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్

  • Feb 22, 2026 22:16 IST

    రింకు(0) ఔట్

    • బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన కేశవ్ మహరాజ్

    • పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన రింకు సింగ్(0)

    • ఈ క్యాచ్ కూడా తీసుకున్నది స్టబ్స్

    • ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • Feb 22, 2026 22:14 IST

    హార్దిక్ పాండ్య(18) ఔట్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

    • మహరాజ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య ఔట్

    • బౌండరీ లైన్ వద్ద క్యాచ్ తీసుకున్న స్టబ్స్

    • 86 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి రింకు సింగ్

  • Feb 22, 2026 22:10 IST

    14 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోర్ 86/5

    • ఎంగిడి వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో పాండ్య(18), దూబే(18)

    • టీమిండియా విజయానికి 36 బంతుల్లో 102 పరుగులు అవసరం

  • Feb 22, 2026 22:02 IST

    నెమ్మదిగా కదులుతున్న స్కోర్ బోర్డు

    • రబాడా వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 7

    • నాలుగో బంతిని బౌండరీకి పంపిన దూబే(14)

    • మరో ఎండ్‌లో పాండ్య(12)

    • 12 ఓవర్లకు టీమిండియా స్కోర్ 75/5

  • Feb 22, 2026 21:58 IST

    హార్దిక్ పాండ్య సిక్సర్

    • 18 బంతుల తర్వాత సిక్సర్ టీమిండియాకు సిక్సర్

    • కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వచ్చిన పరుగులు 11

    • ఓ భారీ సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్య(11)

    • మరో ఎండ్‌లో దూబే(8)

    • 11 ఓవర్లకు టీమిండియా స్కోర్ 68/5

  • Feb 22, 2026 21:54 IST

    10 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోర్ 57/5

    • బాష్ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • క్రీజులో హార్దిక్ పాండ్య(3), దూబే(6)

    • టీమిండియా విజయానికి 61 బంతుల్లో 131 పరుగులు అవసరం

  • Feb 22, 2026 21:49 IST

    టీమిండియా ఐదో వికెట్ డౌన్.. సూర్య(18) ఔట్

    • బాష్ బౌలింగ్‌లో సూర్య(18) ఔట్

    • పదో ఓవర్ తొలి బంతికే బ్రెవిస్‌కు చిక్కిన సూర్య

    • సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • Feb 22, 2026 21:48 IST

    తడబడుతున్న భారత బ్యాటర్లు

    • ఎంగిడి వేసిన తొమ్మిదో ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • క్రీజులో సూర్య(18), దూబే(4)

    • 9 ఓవర్లకు టీమిండియా స్కోర్ 51/4

  • Feb 22, 2026 21:39 IST

    సుందర్(11) ఔట్

    • బాష్‌కు తొలి వికెట్

    • 8వ ఓవర్ రెండో బంతికి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్(11)

    • 43 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి దూబే

  • Feb 22, 2026 21:38 IST

    వాషీ భారీ సిక్సర్

    • కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాదిన వాషింగ్టన్ సుందర్(11)

    • మరో ఎండ్‌లో సూర్య(14)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • 7 ఓవర్లకు టీమిండియా స్కోర్ 42/3

  • Feb 22, 2026 21:32 IST

    పవర్ ప్లే పూర్తి.. టీమిండియా స్కోర్ 31/3

    • రబాడా వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 2

    • క్రీజులో సూర్య కుమార్(11), వాషింగ్టన్ సుందర్(3)

    • టీమిండియా విజయానికి 84 బంతుల్లో 157 పరుగులు అవసరం

  • Feb 22, 2026 21:24 IST

    అభిషేక్ శర్మ(15) ఔట్

    • యాన్సెన్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి బాష్‌కు క్యాచ్ ఇచ్చిన అభిషేక్ శర్మ(15)

    • 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • యాన్సెన్‌కు ఇది రెండో వికెట్

  • Feb 22, 2026 21:22 IST

    నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు

    • లుంగి ఎంగిడి వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 3

    • క్రీజులో సూర్య(9), అభిషేక్ శర్మ(15)

    • 4 ఓవర్లకు టీమిండియా స్కోర్ 26/2

  • Feb 22, 2026 21:16 IST

    సిక్స్ కొట్టిన అభిషేక్

    • మూడో ఓవర్లో 10 పరుగులు

    • 3 ఓవర్లకు టీమిండియా స్కోరు 23/2

  • Feb 22, 2026 21:12 IST

    రెండు ఓవర్లకు టీమిండియా స్కోరు 13/2

    • రెండు ఫోర్లు బాదిన సూర్య

    • క్రీజులో సూర్య, అభిషేక్

  • Feb 22, 2026 21:08 IST

    టీమిండియాకు మరో షాక్

    • తిలక్ వర్మ అవుట్

    • యన్‌సన్ బౌలింగ్‌లో అవుట్

  • Feb 22, 2026 21:05 IST

    తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ అవుట్

    • మార్‌క్రమ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్

    • తొలి ఓవర్‌కు టీమిండియా 1/1

  • Feb 22, 2026 20:49 IST

    ఇన్నింగ్స్ బ్రేక్.. టీమిండియా టార్గెట్ 188

    • హార్దిక్ పాండ్య వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 20

    • రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదిన స్టబ్స్(44*)

    • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగుల చేసిన సౌతాఫ్రికా

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన మిల్లర్(63)

    • బుమ్రాకు 3 వికెట్లు

    • అర్ష్‌దీప్ 2, వరుణ్ చక్రవర్తి, దూబేలకు తలొక వికెట్

    • టీమిండియా విజయ లక్ష్యం 188

  • Feb 22, 2026 20:43 IST

    బుమ్రాకు మూడో వికెట్.. బాష్(5) ఔట్

    • బుమ్రా బౌలింగ్‌లో బాష్(5) ఔట్

    • ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    • 19 ఓవర్లకు స్కోర్ 167/7

  • Feb 22, 2026 20:34 IST

    ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    • అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి రింకు సింగ్‌కి క్యాచ్ ఇచ్చిన యాన్సెన్(2)

    • అర్ష్‌దీప్‌కు ఇది రెండో వికెట్

    • 158 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

  • Feb 22, 2026 20:33 IST

    కట్టుదిట్టమైన బౌలింగ్

    • బుమ్రా వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో స్టబ్స్(20), యాన్సెన్(2)

    • 17 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 157/5

  • Feb 22, 2026 20:27 IST

    మిల్లర్(63) ఔట్

    • వరుణ్ చక్రవర్తికి ఎట్టకేలకు వికెట్

    • 16వ ఓవర్ నాలుగో బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చిన మిల్లర్(63)

    • 152 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

  • Feb 22, 2026 20:24 IST

    నెమ్మదిగా సాగుతున్న స్కోర్ బోర్డు వేగం

    • హార్దిక్ పాండ్య వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • ఓ బౌండరీ బాదిన మిల్లర్(62)

    • మరో ఎండ్‌లో స్టబ్స్(10)

    • 15 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 144/4

  • Feb 22, 2026 20:17 IST

    14 ఓవర్లు పూర్తి.. సౌతాఫ్రికా స్కోర్ 134/4

    • వాషింగ్టన్ సుందర్ వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • క్రీజులో స్టబ్స్(5), మిల్లర్(57)

  • Feb 22, 2026 20:13 IST

    రాణిస్తోన్న సఫారీ బ్యాటర్లు

    • దూబే వేసిన 13వ ఓవర్లో వచ్చిన పరుగులు 17

    • రెండు సిక్సర్లు బాదిన మిల్లర్(54)

    • మరో ఎండ్‌లో స్టబ్స్(2)

    • 13 ఓవర్లకు స్కోర్ 128/4

  • Feb 22, 2026 20:10 IST

    మిల్లర్ హాఫ్ సెంచరీ

    • 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్ మిల్లర్(52)

  • Feb 22, 2026 20:07 IST

    హమ్మయ్య.. ఎట్టకేలకు నాలుగో వికెట్ డౌన్

    • శివం దూబేకు తొలి వికెట్

    • 13వ ఓవర్ రెండో బంతికి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చిన బ్రెవిస్(45)

    • సిక్సర్ బాది తర్వాతి బంతికే బ్రెవిస్ ఔట్

    • 97 పరుగుల భాగస్వామ్యానికి తెరదించిన దూబే

    • 117 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    • క్రీజులోకి స్టబ్స్

  • Feb 22, 2026 20:06 IST

    పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డు

    • వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 12

    • 100 పరుగులు దాటిన ప్రొటీస్ స్కోర్

    • ఈ ఓవర్లో ఓ బౌండరీ బాదిన మిల్లర్(46)

    • మరో ఎండ్‌లో బ్రెవిస్(39)

    • ఈ ఓవర్లో మూడు వైడ్లు వేసిన వరుణ్ చక్రవర్తి

    • సౌతాఫ్రికా స్కోర్ 111/3

  • Feb 22, 2026 20:00 IST

    బ్రెవిస్ దూకుడు

    • శివం దూబే వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 15

    • ఈ ఓవర్లో రెండు వైడ్లు వేసిన దూబే

    • ఓ బౌండరీ, ఓ సిక్సర్ బాదిన బ్రెవిస్(37)

    • మరో ఎండ్‌లో మిల్లర్(40)

    • 11 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 99/3

  • Feb 22, 2026 19:53 IST

    10 ఓవర్లు పూర్తి.. సౌతాఫ్రికా స్కోర్ 84/3

    • హార్దిక్ పాండ్య వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • క్రీజులో బ్రెవిస్(24), మిల్లర్(40)

    • ఆఖరి బంతికి నో బాల్ వేసిన పాండ్య

    • ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మార్చిన మిల్లర్

  • Feb 22, 2026 19:50 IST

    జోరు పెంచిన సఫారీ బ్యాటర్లు

    • వరుణ్ చక్రవర్తి వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 17

    • ఈ ఓవర్లో ఓ సిక్స్‌, ఓ బౌండరీ బాదిన బ్రెవిస్(22)

    • ఓ సిక్సర్ బాదిన మిల్లర్(32)

    • 9 ఓవర్లకు సఫారీల స్కోర్ 73/3

  • Feb 22, 2026 19:44 IST

    నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు

    • హార్దిక్ వేసిన 8వ ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • క్రీజులో బ్రెవిస్(12), మిల్లర్(25)

    • 8 ఓవర్లకు ప్రొటీస్ స్కోర్ 56/3

  • Feb 22, 2026 19:39 IST

    ఆచితూచి ఆడుతున్న సఫారీ బ్యాటర్లు

    • ఏడో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • చెరో ఫోర్ బాదిన బ్రెవిస్(10), మిల్లర్(23)

    • 50 పరుగులు దాటిన ప్రొటీస్ స్కోర్

    • 7 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 52/3

  • Feb 22, 2026 19:31 IST

    దూకుడు పెంచిన మిల్లర్

    • అర్ష్‌దీప్ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • రెండు బౌండరీలు బాదిన మిల్లర్(18)

    • మరో ఎండ్‌లో బ్రెవిస్(4)

    • పవర్ ప్లే పూర్తి.. సౌతాఫ్రికా స్కోర్ 41/3

  • Feb 22, 2026 19:27 IST

    మిల్లర్ ఆన్ ఫైర్

    • వచ్చి రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదిన మిల్లర్(10)

    • వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • క్రీజులో బ్రెవిస్(3), మిల్లర్(10)

    • 5 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 31/3

  • Feb 22, 2026 19:21 IST

    బుమ్రాకు రెండో వికెట్.. కష్టాల్లో సౌతాఫ్రికా

    • బుమ్రా వేసిన నాలుగో ఓవర్ ఆఖరి బంతికి శివం దూబేకి క్యాచ్ ఇచ్చిన రికెల్టన్(7)

    • బుమ్రాకు ఇది రెండో వికెట్

    • ఈ ఓవర్లో వచ్చింది కేవలం 1 పరుగే

    • 4 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 20/3

  • Feb 22, 2026 19:14 IST

    అర్ష్‌దీప్‌కు వికెట్.. మార్క్‌రమ్(4) ఔట్

    • మూడో ఓవర్ నాలుగో బంతికి హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చిన కెప్టెన్ మార్క్‌రమ్(4)

    • 12 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    • క్రీజులోకి బ్రెవిస్

  • Feb 22, 2026 19:09 IST

    సౌతాఫ్రికాకు షాక్.. తొలి వికెట్ డౌన్

    • బుమ్రా వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి డికాక్(6) క్లీన్ బౌల్డ్

    • బౌండరీ బాది తర్వాతి బంతికే డికాక్ ఔట్

    • 10 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్

  • Feb 22, 2026 19:06 IST

    కట్టుదిట్టమైన బౌలింగ్

    • అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • క్రీజులోకి డికాక్(2), మార్క్‌రమ్(2)

    • స్కోర్ 4/0

  • Feb 22, 2026 19:01 IST

    సౌతాఫ్రికా బ్యాటింగ్

    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

    • క్రీజులోకి డికాక్, మార్క్‌రమ్

    • తొలి ఓవర్ వేస్తోన్న అర్ష్‌దీప్ సింగ్

  • Feb 22, 2026 18:39 IST

    భారత తుది జట్టు:

    • అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి

  • Feb 22, 2026 18:38 IST

    సౌతాఫ్రికా తుది జట్టు:

    • ఐడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, మిల్లర్, బ్రెవిస్, స్టబ్స్, యాన్సెన్, బోష్, కేశవ్ మహరాజ్, రబాడ, లుంగి ఎంగిడి

  • Feb 22, 2026 18:34 IST

    టాస్ నెగ్గిన సౌతాఫ్రికా

    • అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న భారత్-సౌతాఫ్రికా

    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

    • తొలుత ఫీల్డింగ్ చేయనున్న టీమిండియా