తెలంగాణ, పుదుచ్చేరి గెలుపు
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:36 AM
దక్షిణ భారత పోలీస్ టీ-20 క్రికెట్ పోటీల్లో తెలంగాణ, పుదుచ్చేరి జట్లు గెలుపొందాయి. మూలపాడు ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ...
దక్షిణ భారత పోలీస్ టీ-20 క్రికెట్ పోటీలు
విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత పోలీస్ టీ-20 క్రికెట్ పోటీల్లో తెలంగాణ, పుదుచ్చేరి జట్లు గెలుపొందాయి. మూలపాడు ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 124 పరుగుల తేడాతో ఎన్‌ఎ్‌సజీపై నెగ్గింది. మొదట తెలంగాణ 20 ఓవర్లలో 259/2 స్కోరు చేసింది. లోకనాథ్ నాయక్ (119) సెంచరీతో మెరవగా, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ 40 రన్స్ రాబట్టారు. ఛేదనలో ఎన్‌ఎ్‌సజీ 18.3 ఓవర్లలో 135 రన్స్‌కు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై 4 వికెట్లతో పుదుచ్చేరి నెగ్గింది. తొలుత రాహుల్ (141) శతకంతో రాణించడంతో ఏపీ 20 ఓవర్లలో 217/6 స్కోరు సాధించింది. ఛేదనలో ప్రభు (121) సెంచరీతో సత్తా చాటడంతో పుదుచ్చేరి 18.4 ఓవర్లలోనే 221/6 స్కోరు చేసి గెలిచింది.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్