కుమారుడికి ప్రేమతో.. రూ.4 కోట్ల కారు గిఫ్ట్
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:38 AM
నాలుగేళ్ల తన కుమారుడికి భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అతి ఖరీదైన బహుమతిని అందించాడు. ప్రస్తుతం తల్లి నటాషా స్టాంకోవిచ్‌వద్దే ఉంటున్న ఐదేళ్ల అగస్త్యకు...
ముంబై: నాలుగేళ్ల తన కుమారుడికి భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అతి ఖరీదైన బహుమతిని అందించాడు. ప్రస్తుతం తల్లి నటాషా స్టాంకోవిచ్‌వద్దే ఉంటున్న ఐదేళ్ల అగస్త్యకు ల్యాండ్‌రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. లగ్జరీ విభాగానికి చెందిన ఈ కారు ధర ఏకంగా రూ. 4 కోట్లు ఉంటుందట. స్థానిక షోరూమ్‌లో తల్లీ కొడుకు కలిసి కారు తాళాలు అందుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండేళ్ల క్రితం హార్దిక్ దంపతులు విడిపోగా.. అగస్త్య పెంపకంలో మాత్రం ఇద్దరూ రాజీ పడడం లేదు. ప్రస్తుతం కొత్త ప్రేయసి మహికా శర్మతో పాండ్యా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్