టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: టీమిండియాపై సౌతాఫ్రికా ఘన విజయం
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:50 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించి.. సూపర్ 8లో తొలి ఓటమిని చవి చూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించి.. సూపర్ 8లో తొలి ఓటమిని చవి చూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూపర్ 8లో ప్రొటీస్ జట్టు శుభారంభం చేసింది.
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్ తీవ్రంగా విఫలమైంది. దూబే(42) టాప్ స్కోరర్. ఇషాన్ కిషన్(0), అభిషేక్ శర్మ(15), తిలక్ వర్మ(1), సూర్యకుమార్(18), వాషింగ్టన్ సుందర్(11), హార్దిక్ పాండ్య(18), రింకు సింగ్(0), అర్ష్‌దీప్ సింగ్(1), బుమ్రా(0) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. వరుణ్ చక్రవర్తి(0) నాటౌట్‌గా నిలిచాడు. కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. యాన్సెస్ 4 వికెట్లతో భారత జట్టు పతనాన్ని శాసించాడు. తొలి ఓవర్లోనే మార్క్‌రమ్ ఇషాన్‌ను డకౌట్ చేశాడు. బాష్ 2 వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా ఓటమి లాంఛనమైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(63) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్ష్‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి 1, శివం దూబే 1 వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్