భారత స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. మరోవైపు పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ సేన చెలరేగుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. టీమిండియాపై 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. క్రికెట్ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టోర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 6.30కి టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల కానుంది.
టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన , సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం ఆగిపోయింది. తాజాగా వీరి వివాహం రద్దుపై పలాశ్ సోదరి పలాక్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు.
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. మూడో రోజు ఆటలో నితీస్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ ను ప్రొటీస్ జట్టు ప్లేయర్ మార్క్‌రమ్ గాల్లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో అందుకున్నాడు.
బ్యాటర్ల నిర్లక్ష్యంతో సొంతగడ్డపై భారత్‌కు మరో ఘోర పరాభవం తప్పేట్టు లేదు. మార్కో యాన్సెన్ (6/48) షార్ట్ బాల్స్ వ్యూహానికి మనోళ్లు బెంబేలెత్తారు. దీంతో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొన్న పర్యాటక దక్షిణాఫ్రికా...
డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి మహిళల కబడ్డీ వరల్డ్‌కప్ ట్రోఫీని కైవసం చేసుకొంది. సోమవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్ 35-28 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించి విజేతగా నిలిచింది....
బధిర ఒలింపిక్స్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత షూటర్ ప్రాంజలి ప్రశాంత్ ధూమల్ అదరగొట్టింది. ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన...