తాజాగా ఓ వ్యక్తి తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ ప్రపోజల్ చూసి ఆ అమ్మాయి చాలా సంతోష పడిపోయింది. వెంటనే అతడి ప్రేమను అంగీకరించింది.
భారత్‌లో పర్యటించే విదేశీయులు నిత్యం స్లమ్ ఏరియాలు మాత్రమే చూడాలని ఎందుకు అనుకుంటారంటూ ఓ ఆస్ట్రేలియా వ్లాగర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించిన అతడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రోడ్డు పక్కన పడున్న రాళ్లను తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. వాటిని అందమైన గడియారాలుగా మార్చి అమ్మేస్తున్నాడు. వందల నుంచి వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అంటే చూడగానే ప్రేమలో పడిపోవడం. అలా ప్రేమించిన వారికి వినూత్న రీతిలో ప్రపోజ్ చేసేందుకు యత్నిస్తుంటారు కొందరు. ఆ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోవాలని ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు. అలాంటి కొన్ని ప్రపోజల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఆ రకమైన స్పెషల్ ప్రపోజల్ ఒకటి మీకోసం...
జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కొడుకు పేరు శేఖర్ అని తెలిపారు.
ఆమ్‌స్టర్‌డ్యామ్ నగర వీధుల్లో చెత్తాచెదారం ఉన్నా జనాలు మాత్రం కేవలం భారతీయులకే పౌర స్పృహ లేనట్టు మాట్లాడుతుంటారంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
జాబ్‌కు అప్లై చేసుకున్న నిమిషాల్లో తిరస్కరణకు గురయిన ఓ అభ్యర్థి తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నాడు. రిక్రూటర్ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.