సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకైనా ఇంత జీతం రాదేమో.. ఈ వ్యక్తి దుస్తులు ఇస్త్రీ చేస్తూ ఎంత సంపాదిస్తున్నాడంటే..
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:21 PM
బాహుళ జాతి సంస్థల్లో పని చేసే వారు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారని అందరూ అనుకుంటారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుందని చాలా మంది భావిస్తారు.
బాహుళ జాతి సంస్థల్లో పని చేసే వారు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారని అందరూ అనుకుంటారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు కూడా భారీగానే సంపాదిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (dry cleaner viral video).
కంటెంట్ క్రియేటర్ నళిని ఉంగర్ తమ ఇంటికి సమీపంలో ఉన్న డ్రై క్లీనింగ్ చేసే వ్యక్తి నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడని తెలిసి షాకయ్యారు. నళిని కాలనీలోని చాలా మంది ఆ వ్యక్తి దగ్గరే తమ దుస్తులను ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ కోసం ఇస్తుంటారట. ఆ వ్యక్తి రోజులో దాదాపు 350 వస్త్రాలను ఇస్త్రీ చేస్తాడట. ఒక్కో వస్త్రానికి రూ.10 తీసుకుంటాడట. అంటే ఇస్త్రీ ద్వారా సుమారు రూ. 3500 సంపాదిస్తాడన్నమాట. ఇక, ఖరీదైన వస్త్రాలను కూడా అతడు డ్రై క్లీనింగ్ చేస్తాడు (small business success).
ఒక్కో వస్త్రాన్ని డ్రై క్లీనింగ్ చేసినందుకు రూ.350 తీసుకుంటాడట. రోజులో దాదాపు 20 దుస్తులను డ్రై క్లీనింగ్ చేస్తాడట. అవి చేసినందుకు మరో రూ.3500 సంపాదిస్తాడట. అంటే రోజులో అతడి సంపాదన దాదాపు రూ.7 వేలు. నెలలో 27 రోజులు పనిచేస్తే, అతడి మొత్తం ఆదాయం సుమారు 2.8 లక్షల రూపాయలు. ఆ దుకాణం అతడిదే కాబట్టి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. విద్యుత్ బిల్లు దాదాపు రూ. 6,000 అని, ఇద్దరు సహాయకుల నెల జీతం రూ. 40,000 అని, ఇతర ఖర్చులు తీసేస్తే అతడికి నెలకు దాదాపు రూ.2 నుంచి 2.3 లక్షల వరకు మిగులుతుందని నళిని పేర్కొన్నారు (₹2 lakh monthly income).
ఈ వీడియో చూసి సోషల్ మీడియా జనాలు ఆశ్చర్యపోతున్నారు (viral earnings video). డబ్బు సంపాదించడం అనేది డిగ్రీలపై కాదని, నైపుణ్యం, శ్రమపై ఆధారపడి ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. పెద్ద పెద్ద నగరాల్లో చిన్న వ్యాపారాల శక్తిని మన దేశంలో చాలా మంది ఇంకా గుర్తించడం లేదని మరికొందరు కామెంట్లు చేశారు. ప్రజలు ఉద్యోగాల కోసం వెంపర్లాడడం కాకుండా, వ్యాపారాన్ని కొత్త కోణం నుంచి చూడడం నేర్చుకోవాలని మరికొందరు యూజర్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..