Share News

భారతీయ స్నేహాల్ని తక్కువ అంచనా వేయొద్దు: జర్మనీ యువతి

ABN , Publish Date - Feb 10 , 2026 | 09:39 PM

భారతీయుల స్నేహం అద్భుతమంటూ ఇటీవల ఓ జర్మనీ యువతి చేసిన వీడియో వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

భారతీయ స్నేహాల్ని తక్కువ అంచనా వేయొద్దు: జర్మనీ యువతి
German tourist India viral video

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల్ని, వారి మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ ఓ జర్మనీ యువతి కామెంట్ చేశారు. భారత్‌లో తనకు ఎదురైన ఇబ్బందుల నుంచి ఫ్రెండ్స్ ఎలా గట్టెక్కించారో చెబుతూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (German Woman Viral Video).

బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ అనే యువతి ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. ఒకే క్రెడిట్ కార్డు, పర్సును వెంట తెచ్చుకున్నారు. దురదృష్టవశాత్తూ అవి రెండూ పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కానీ భారత్‌లోని ఫ్రెండ్స్ తనను ఆదుకోవడంతో ఈ కష్టం నుంచి సునాయాసంగా గట్టెక్కానని అన్నారు (Friendships in India).


‘ఇక్కడ నా ఫ్రెండ్స్‌ అందరూ నిత్యం నన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారు. ట్రిప్ పూర్తి అయ్యే వరకూ నాకు కావాల్సిన డబ్బులు అడిగి మరీ ఇచ్చారు. నాకు క్షణం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. అసలు ఇలాంటి బ్యాకప్ సిస్టమ్ ఉంటుందని నేను అనుకోలేదు. ట్రిప్ పూర్తయ్యాక నేను ఎవరి డబ్బులు వారికి ఇచ్చేశాను. భారతీయుల స్నేహం, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు’ అని కామెంట్ చేశారు.

ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వారి మధ్య ఫ్రెండ్‌షిప్ గొప్పదని అనేక మంది కామెంట్ చేశారు. భారతీయుల ఆతిథ్యానికి సాటిరాగలది మరేదీ లేదని అన్నారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని మరొక వ్యక్తి కామెంట్ చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన రెండు రోజులకే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Updated Date - Feb 10 , 2026 | 10:00 PM