Share News

సర్‌ప్రైజ్ ఇచ్చిన పనిమనిషి.. ఇంటి ఓనర్‌కు పట్టలేని ఆనందం

ABN , Publish Date - Feb 09 , 2026 | 08:17 PM

ఓ పనిమనిషి తన ఇంటి ఓనర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంటి ఓనర్ పెళ్లి రోజున ఆమెకు ఒక రోజా పువ్వు, చాక్లెట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సర్‌ప్రైజ్ ఇచ్చిన పనిమనిషి.. ఇంటి  ఓనర్‌కు పట్టలేని ఆనందం
Bengaluru Domestic Help Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఇంటి పనుల్లో సహాయంగా ఉండే వ్యక్తులకు ఇంటి ఓనర్స్‌ బహుమతులు ఇవ్వడం కామన్. కానీ ఇందుకు విరుద్ధంగా ఓనర్స్‌కే పనిమనిషి సర్‌ప్రైజ్ ఇవ్వడం ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Bengaluru House Maid Viral Video).

తమ ఇంటి పని మనిషి ఇచ్చిన బహుమతికి సర్‌ప్రైజ్ అయిపోయిన ఇంటి ఓనర్ ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. త్వరలో తమ పెళ్లి రోజు ఉందని పనిమనిషికి తాను ఇటీవల తెలిపినట్టు ఇంటి ఓనర్ పంచుకున్నారు. అయితే, సరిగ్గా పెళ్లి రోజున ఆమె తమకు ఓ గులాబీ పువ్వు, ఒక చాక్లె‌ట్‌ను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిందని అన్నారు. బ్లింకిట్‌ నుంచి స్వయంగా ఆర్డరిచ్చి వాటిని తెప్పించుకున్నట్టు ఆమె పేర్కొందని కూడా తెలిపారు. ఈ క్రమంలో ఇంటి ఓనర్ ఉబ్బితబ్బిబ్బు కాగా ఆమె భర్త వెళ్లి పని మనిషి కాళ్లు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.


ఇక ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పనిమనిషిది గొప్ప మనసని అన్నారు. పెళ్లి రోజును గుర్తుపెట్టుకుని మరీ బహుమతి ఇవ్వడం కల్మషం లేని ఆమె మనసుకు రుజువని కామెంట్ చేశారు.

కాగా, దుబాయ్‌లో ఇటీవల ఇలాంటి మరో ఘటన వెలుగు చూసింది. తన ఇంట్లో సహాయకురాలిగా ఉండే ఓ మహిళకు ఇంటి ఓనర్ ఏకంగా ఒక లాప్‌టాప్ బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

Updated Date - Feb 09 , 2026 | 09:03 PM