ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరా కొరత భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో ఖతార్‌లోని కీలక గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ప్రపంచ ఇంధన రంగాన్ని కలవరపెడుతోంది.
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై మరికొన్ని గంటల్లో ఇరాన్ దాడి చేయబోతోందని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ కాసేపటి క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లారిజానీని లక్ష్యంగా చేసుకుని సోమవారం రాత్రి దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైనిక అధికారులు ప్రకటించారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఈ యుద్ధం పరిస్థితుల గురించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించింది.
దుబాయ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఇంధన ట్యాంకుపై సోమవారం ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో కలకలం రేగింది. ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలనే హోర్ముజ్ జలసంధి గుండా అనుమతించడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చని తెలిపారు.
ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్‌పై భీకర దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు ఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. హోర్ముజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి.