మేం చెప్పినట్టు వింటేనే ప్రశాంతత, అభివృద్ధి.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ వార్నింగ్..
ABN , Publish Date - Mar 28 , 2026 | 07:30 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై దాడులు ఆగాలన్నా, ప్రశాంతత నెలకొని అభివృద్ధి జరగాలన్నా తమ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పారు (Iran President warning Gulf countries).
'గల్ఫ్ దేశాలపై దాడులు ఆగాలన్నా, ప్రశాంతత నెలకొని అభివృద్ధి జరగాలన్నా మా మాట వినాలి. ఆయా దేశాల గగన తలాలను వాడుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుమతి ఇవ్వకూడదు. మేము ఏ దేశంపైనా ముందస్తు దాడులు చేయబోం. కానీ, మా మౌలిక సదుపాయాలు, అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం చూస్తూ ఉరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం. శత్రు స్థావరాలు భూస్థాపితం అయ్యే వరకు దాడులు చేస్తాం. శత్రువులకు సహకరించిన వారిని కూడా వదలం' అని మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు (Iran Gulf tensions).
తమ గగన తలాలను వినియోగించుకుని ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు గల్ఫ్ దేశాలు అనుమతి నిరాకరించాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారు (Iran foreign policy). ఈ మేరకు బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇతర పశ్చిమాసియా దేశాలకు పెజెష్కియాన్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..
ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..