Share News

వేదికపై పళ్లు ఊడిపోయాయి.. అయినా ఆ మోడల్ ఏం చేసిందో చూస్తే అభినందించాల్సిందే..

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:09 PM

క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనపుడు బెదరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే విజయం స్వంతమవుతుంది. అందాల పోటీలలో పరిపూర్ణతను ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి.

వేదికపై పళ్లు ఊడిపోయాయి.. అయినా ఆ మోడల్ ఏం చేసిందో చూస్తే అభినందించాల్సిందే..
Miss Grand Thailand contestant

క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనపుడు బెదరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే విజయం స్వంతమవుతుంది. అనుకోకుండా జరిగిన పొరపాట్ల గురించి బాధపడుతూ కూర్చోకుండా ముందుకు నడవడమే నిజమైన అందమని తాజాగా మిస్ గ్రాండ్ థాయ్‌లాండ్ పోటీల్లో పాల్గొన్న కమోల్వాన్ చనాగో అనే మోడల్ నిరూపించింది. ఆమెకు వేదిక మీద ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దానిని ఆమె ఎదుర్కొన్న తీరు చాలా మంది నుంచి అభినందనలు అందుకుంటోంది (Miss Grand Thailand contestant).


మార్చి 25వ తేదీన, థాయ్‌లాండ్‌లో జరిగిన ర్యాంప్ వాక్ పోటీలలలో కమోల్వాన్ చనాగో అనే మోడల్ మైక్ ముందు నిల్చుని తనను తాను పరిచయం చేసుకుంటోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమె కట్టుడు పళ్లు ఊడిపోయాయి. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా కంగారుపడతారు. అంత మంది ముందు పరువు పోయిందని బాధపడతారు. కానీ చనాగో కంగారు పడలేదు. వెంటనే వెనక్కి తిరిగి, తన కట్టుడు పళ్లను సరిచేసుకుంది. ఏమీ జరగనట్టు చిరునవ్వుతో తన ర్యాంప్ వాక్‌ను పూర్తి చేసింది (Dentures fall ramp walk).


వేదిక మీద అందరి ముందు ఆమె ఆత్మవిశ్వాసం, ప్రశాంతమైన ప్రవర్తన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి (Beauty pageant viral moment). ఆమె తన ప్రదర్శనను కొనసాగిస్తుండగా, ప్రేక్షకులు చప్పట్లతో ఆమెను ఉత్సాహపరిచారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని అభినందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆమెను విమర్శించినప్పటికీ, ఎక్కువ మంది ఆమెను ప్రశంసించారు. 'నిజమైన అందం పరిపూర్ణతలో కాదు, కష్ట సమయాల్లో మనల్ని మనం నిలబెట్టుకోవడంలోనే ఉంటుంద'ని కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..


ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Mar 28 , 2026 | 07:37 PM