Share News

అక్కడ ఒక సంవత్సరం అంటే 11 గంటలే.. ఈ వింత గ్రహం గురించి తెలిస్తే..

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:08 PM

ఈ విశాల విశ్వంలో అనేక పాల పుంతలు, సౌర మండలాలు ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఆసక్తికర గ్రహాల్లో ఒకటి 'TOI-561 b'.

అక్కడ ఒక సంవత్సరం అంటే 11 గంటలే.. ఈ వింత గ్రహం గురించి తెలిస్తే..
super Earth exoplanet

ఈ విశాల విశ్వంలో అనేక పాల పుంతలు, సౌర మండలాలు ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఆసక్తికర గ్రహాల్లో ఒకటి 'TOI-561 b'. ఇది ఒక సూపర్ ఎర్త్ గ్రహం. దీని ప్రత్యేకతలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా భూమి కంటే పెద్దవైన రాతి గ్రహాలను సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు. ఇవి ఘన ఉపరితలం కలిగిన గ్రహాలు (Super Earth exoplanet).


'TOI-561 b' గ్రహాన్ని ట్రాన్‌సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) అనే అంతరిక్ష మిషన్ ద్వారా గుర్తించారు. ఈ 'TOI-561 b' గ్రహం భూమి కంటే సుమారు 1.4 రెట్లు పెద్దది. భారం 3 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం TOI-561 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ సూపర్ ఎర్త్ ఆ నక్షత్రం చుట్టూ తిరగడానికి కేవలం 10.5 గంటలు మాత్రమే పడుతుంది. అంటే దాదాపు 11 గంటల్లోనే ఆ గ్రహంపై ఒక సంవత్సరం పూర్తయిపోతుందన్నమాట. ఈ గ్రహంపై ఉపరితల ఉష్ణోగ్రతలు 2000°C వరకు ఉంటాయట (Space discovery).


ఈ 'TOI-561 b' గ్రహం.. నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దీనిని లావా గ్రహంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు (Lava planet). అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ గ్రహం ఉపరితలం కరిగిపోయి ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ జీవం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇంత వేడి ఉన్నప్పటికీ, ఈ గ్రహానికి దట్టమైన వాతావరణం ఉండటం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇంత వేడిగా ఉండే గ్రహాలు తమ వాతావరణాన్ని నిలుపుకోలేవని గతంలో నమ్మేవారు. ఈ గ్రహం వాతావరణంలో నీరు, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.


ఇవి కూడా చదవండి..

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..


ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Mar 28 , 2026 | 06:08 PM