యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరికాకు సహాయం..
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:07 PM
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తెరిపించే క్రమంలో అమెరికాకు సహాయంగా నిలవాలని యూఏఈ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి (UAE Iran war).
తన భూభాగంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్.. యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో యూఏఈలో పర్యాటక రంగం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ఎగుమతులు ఆగిపోయి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఇక, ఇరాన్‌పై తాము చేస్తున్న దాడులకు సహాయం చేయడం లేదని మిత్రదేశాలపై మంగళవారం నాడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎదుర్కొంటున్న వారు తోడుగా రాకపోతే, హోర్ముజ్ జలసంధిని తెరిపించడం అమెరికా బాధ్యత కాదని ఆయన హెచ్చరించారు ( UAE US alliance Iran).
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు అండగా నిలబడాలని యూఏఈ భావిస్తోందట (Strait of Hormuz crisis). హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, యూరప్, ఆసియాలోని సైనిక శక్తులు ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేయాలని కూడా యూఏఈ ప్రతిపాదించనుందట. ఇరాన్‌పై సైనిక చర్యకు అనుమతించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానం కోసం యూఏఈ ఒత్తిడి చేస్తోందట. ఒకవేళ ఈ తీర్మానికి రష్యా, చైనా అడ్డుపడితే అమెరికాకు సైనిక మద్దతు అయినా ఇవ్వాలని యూఏఈ భావిస్తోందట.
ఇవి కూడా చదవండి..
వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..
ఆ హామీలు ఇస్తే.. యుద్ధం ముగింపునకు రెడీ..: ఇరాన్ అధ్యక్షుడు