Share News

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:06 AM

నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పాటు వరుస పండుగలు, సెలవులతో పనిదినాల్లో బ్యాంకులు బిజీగా మారనున్నాయి. వివిధ కారణాలతో 2026 ఏప్రిల్‌లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!
April bank holidays 2026

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి బ్యాంకుల్లో వివిధ రకాల పనులు ఉంటాయి. అందుకే ప్రతి నెల బ్యాంకులకు సంబంధించిన సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల సెలవుల జాబితాను (Bank Holidays list) ప్రకటించింది. ఇక ఆర్బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నెలలో 14 రోజులు పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.


ఇందులో కొన్ని దేశవ్యాప్తంగా సెలవులు ఉంటే.. మరికొన్ని ప్రాంతీయ పండుగలకు సంబంధించిన హాలిడేస్ ఉన్నాయి. అలానే వారాంతపు సెలవులు.. అనగా 2వ, 4వ శనివారం, ఆదివారం కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, ప్రాంతీయ పండగల నేపథ్యంలో ఈ సెలవుల జాబితాలో రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య తేడాలుంటాయి. బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ డిజిటల్ సేవలు కొనసాగుతాయి. వినియోగదారులు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా డబ్బు పంపవచ్చు లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు.


ఏప్రిల్ నెలలో సెలవుల జాబితా

  • ఏప్రిల్1: దేశవ్యాప్తంగా వార్షిక బ్యాంక్ సెలవు దినం

  • ఏప్రిల్2: ఈస్టర్ ముందు పవిత్ర గురువారం

  • ఏప్రిల్3: గుడ్ ఫ్రైడే

  • ఏప్రిల్ 5: ఆదివారం

  • ఏప్రిల్11: 2వ శనివారం

  • ఏప్రిల్12: ఆదివారం

  • ఏప్రిల్14: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి

  • ఏప్రిల్ 15: బెంగాలీ న్యూ ఇయర్

  • ఏప్రిల్16: భోగహ్ బిహు హాలిడే

  • ఏప్రిల్ 19: ఆదివారం

  • ఏప్రిల్20: అక్షయ తృతీయ

  • ఏప్రిల్ 21: గరియా పూజ(త్రిపురలో)

  • ఏప్రిల్ 25: 4వ శనివారం

  • ఏప్రిల్ 26: ఆదివారం

ఖాతాదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకునేందుకు ఈ సెలవుల జాబితా ఉపయోగపడుతుంది.


ఇవి కూడా చదవండి:

ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్‌

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈ సారి ఏకంగా రూ. 195

Updated Date - Apr 01 , 2026 | 12:38 PM