Share News

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈ సారి ఏకంగా రూ. 195

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:10 AM

మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై 114.5 రూపాయలు పెంచాయి. మార్చి 7వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు పెంచాయి.

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈ సారి ఏకంగా రూ. 195
commercial LPG price hike

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరాలో తీవ్ర ఆటంకం నెలకొంది. భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుక్ చేసి 10 రోజులు అవుతున్నా కానీ, గ్యాస్ సిలిండర్ డెలివరీ అవటం లేదు. మరో వైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా 70 శాతం నిలిచిపోయిందని అంచనా.


మళ్లీ భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై 114.5 రూపాయలు పెంచాయి. మార్చి 7వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు పెంచాయి. ఆయిల్ కంపెనీలు బుధవారం (ఏప్రిల్ 1, 2026) కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై 195 రూపాయలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 2,078.50 రూపాయలుగా ఉంది. ఇక, బ్లాక్ మార్కెట్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 10 వేల రూపాయల వరకు పలుకుతోంది.


కాగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియ్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరల్లో మార్పులు చేస్తూ ఉంటాయి. ఇంటర్‌నేషనల్ బెంచ్‌మార్క్, ఎక్సేంజ్ రేట్‌ను దృష్టిలో పెట్టుకుని ధరల్లో మార్పులు చేస్తుంటాయి. యుద్ధం మొదలైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు 50 శాతం పెరిగాయి.


ఇవి కూడా చదవండి

మరో వివాదంలో బెన్ డకెట్.. భారీ జరిమానా విధించిన కోర్టు

వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..

Updated Date - Apr 01 , 2026 | 08:35 AM