విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాను ఆహ్వానిస్తానన్నారు. అలాంటి వారు చిప్‌లు, క్షిపణులు వంటి సంక్లిష్ట ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలన్నది అమెరికా ఉద్యోగులకు నేర్పిస్తారని చెప్పారు.....
నేపాల్‌లో మళ్లీ యువత నిరసనల బాట పట్టింది. బారా జిల్లాలో సీపీఎన్-యూఎమ్ఎల్ నేతలు స్థానిక యువతపై దాడి చేయడంతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో గురువారం రాత్రి 8 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు.
వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు
ఎప్స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.
అమెరికాలోని న్యూజెర్సీలో 2017 మార్చిలో జరిగిన జంటహత్యల కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యలు జరిగిన తర్వాత.. భారత్‌కు తిరిగి వెళ్లిపోయిన ఓ యువకుడే ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు.
ఓ దేశంతో వాణిజ్య చర్చల సందర్భంగా మూర్ఖపు వ్యక్తులపై గట్టిగా అరిచానని, దానితో తన గొంతు బొంగురుపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.....