ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటీష్ రచయిత డేవిడ్ సలైను వరించింది. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలై రాసిన భావోద్వేగభరిత 'ఫ్లెష్' నవలకు ఈ అవార్డు దక్కింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్ చేశారంటూ విమర్శలు రావడంతో ఏకంగా బీబీసీ హెడ్, మరో ఉన్నతాధికారి...
దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది.
పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
జపాన్‌లో భూ ప్రకంపనలు మరోసారి అల్లకల్లోలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో అక్కడ మూడుసార్లు సునామీ కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేశారు అక్కడి అధికారులు.
అమెరికా పౌరసత్వం ఉన్న ఓ భారత సంతతి వ్యక్తిని వలసల శాఖ అధికారులు అతడి ఇమిగ్రేషన్ స్టేటస్ గురించి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన వైనం తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటనను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఖండించింది.
పాక్ ఆర్మీ చీఫ్ అధికారాలను మరింత విస్తృత పరిచేందుకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలకు తెరతీశాయి. రిటైర్మెంట్ తరువాత కూడా ఆర్మీ చీఫ్‌పై కేసు పెట్టే వీలులేకుండా ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది.
జపాన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సనాయె తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ దేశంలో తనతో సహా క్యాబినెట్ సభ్యులకు అదనపు జీతాలు చెల్లించకూడదని నిర్ణయం తీస్కున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
శనివారం రష్యా జరిపిన దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లోని గృహ సముదాయాలపై జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఉక్రెయిన్‌లోని నిప్రో, జఫోరిజ్జియా నగరాలపై రష్యా క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు పాల్పడింది.