Share News

గల్వాన్‌ తర్వాత చైనా రహస్య అణుపరీక్షలు!

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:31 AM

భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌లో ఘర్షణ జరిగిన కొద్ది రోజుల్లోనే చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించినట్టు అమెరికా తెలిపింది.

గల్వాన్‌ తర్వాత చైనా రహస్య అణుపరీక్షలు!

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 8: భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌లో ఘర్షణ జరిగిన కొద్ది రోజుల్లోనే చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించినట్టు అమెరికా తెలిపింది. దీనిని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ‘డీకప్లింగ్‌’ విధానం అనుసరించినట్టు అమెరికా అధికారి(అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌) థామస్‌ జీ డినానో ఆరోపించడం సంచలనం సృష్టించింది. 2020, జూన్‌ 22న చైనా ఈల్డ్‌-ప్రొడ్యూసింగ్‌ అణుపరీక్షలు చేపట్టిందని థామస్‌ తెలిపారు. దీనిలో వందల టన్నుల పదార్థాలను వినియోగించిందన్నారు. అంతర్జాతీయ సమాజం దీనిని గుర్తించకుండా ఉండేలా పలు విధానాలను కూడా అనుసరించినట్టు పేర్కొన్నారు. ‘‘డీకప్లింగ్‌ విధానం వల్ల భూకంప పర్యవేక్షణ ప్రభావం తగ్గి.. ఇతరులు గుర్తించడం కష్టమవుతుంది.’’ అని థామస్‌ తన సోషల్‌ మీడియాలో వివరించారు.

Updated Date - Feb 09 , 2026 | 01:31 AM