Share News

రష్యా మిలిటరీ ఉన్నతాధికారిపై కాల్పులు

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:44 AM

రష్యా సైనిక నిఘా విభాగం (జీఆర్‌యూ) లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్‌ ఫస్ట్‌ డిప్యూటీ హెడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వ్లాదిమిర్‌ అలెక్సీవ్‌...

రష్యా మిలిటరీ ఉన్నతాధికారిపై కాల్పులు

మాస్కో, ఫిబ్రవరి 6: రష్యా సైనిక నిఘా విభాగం (జీఆర్‌యూ) లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్‌ ఫస్ట్‌ డిప్యూటీ హెడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వ్లాదిమిర్‌ అలెక్సీవ్‌ (64)పై శుక్రవారం గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. మాస్కోలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అలెక్సీవ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలోని సీనియర్‌ సైనిక అధికారులే లక్ష్యంగా జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అలెక్సీవ్‌ 2011 నుంచి రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా దేశాల మధ్య రెండు రోజుల చర్చలు ముగిసిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

Updated Date - Feb 07 , 2026 | 03:44 AM