Share News

అమెరికాలో 25వేల మంది ‘విదేశీ నేరగాళ్ల’ అరెస్టు

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:59 AM

అక్రమ పద్ధతుల్లో అమెరికాకు చేరుకుని చట్టవ్యతిరేక, నేర పూరిత చర్యలకు పాల్పడుతున్న విదేశీయుల జాబితాను ట్రంప్‌ ప్రభుత్వం విడుదల చేసింది. హత్యలు, లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల...

అమెరికాలో 25వేల మంది ‘విదేశీ నేరగాళ్ల’ అరెస్టు

  • వీరిలో భారత సంతతికి చెందిన 89 మంది

న్యూయార్క్‌, ఫిబ్రవరి 6: అక్రమ పద్ధతుల్లో అమెరికాకు చేరుకుని చట్టవ్యతిరేక, నేర పూరిత చర్యలకు పాల్పడుతున్న విదేశీయుల జాబితాను ట్రంప్‌ ప్రభుత్వం విడుదల చేసింది. హత్యలు, లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్ర నేరాలకు పాల్పడ్డారంటూ 25 వేలమందిని ఈ జాబితాలో చేర్చారు. భారత్‌ సంతతికి చెందిన 89 మంది కూడా ఆ జాబితాలో ఉన్నారు. ‘అక్రమ నేరపూరిత విదేశీయుల’ లిస్టులో వీరిని చేర్చారు. వీరందరినీ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వ్యక్తి పేరు, దేశం, నేర చరిత్ర వంటి వివరాలను ఫొటోతో సహా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ, విస్తృత ప్రచారం కల్పిస్తోంది. దీనివల్ల నేరాలకు పాల్పడుతున్న విదేశీయుల వివరాలు అమెరికా పౌరులు తెలుసుకుంటారని ‘ డీహెచ్‌ఎస్‌’ అధికారులు తెలిపారు. చివరి విదేశీ నేరగాడిని ఏరివేసేవరకు తనిఖీలు కొనసాగుతాయని డీహెచ్‌ఎ్‌స స్పష్టం చేసింది.

Updated Date - Feb 07 , 2026 | 03:59 AM