తలనొప్పి వచ్చినప్పుడు చాలామంది వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. కెఫిన్ కొందరికి తలనొప్పి, మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. అయితే ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం లేదా ఒక్కసారిగా మానేయడం కూడా తలనొప్పికి కారణం కావచ్చు.
కండరాల పెరుగుదల కోసం ప్రొటీన్ తీసుకోవడం మంచిదే. కానీ అవసరానికి మించి ప్రొటీన్ తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు కంటే హానినే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా తల, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు కనిపిస్తున్నారు.
మయోపియా ఉన్న పిల్లలకు దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ దూరంలోని వస్తువులు మసకగా కనిపిస్తాయి
మధుమేహం కారణంగా ప్రతీ ఏడాది సుమారు లక్షమంది కాలు తొలగించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
ఫ్యాటీ లివర్ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
మధుమేహం పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. కొన్ని సులభమైన అలవాట్లు కూడా డయాబెటిస్ నియంత్రణకు తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు లభించే పనీర్ విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే కాలేయంలో సమస్యలు వచ్చినప్పుడు శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది.
తరచుగా గ్యాస్ట్రిక్ సమస్య రావడం చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే దీనికి ఆహారం మాత్రమే కారణం కాదు, రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ప్రధాన కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.