30 నుంచి 35 ఏళ్ల మధ్య.. బీపీ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.!
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:02 PM
ఇటీవలి కాలంలో యువతలో బీపీ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే దీనికి కారణం ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యను ఎలా నియంత్రించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బీపీ ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య. దీన్ని నియంత్రించకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో యువతలో.. ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారిలో బీపీ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
జీవనశైలి, ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే ఈ సమస్య పెరుగుతోంది. అధిక రక్తపోటు సమస్య చాలాసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి లక్షణాలను ముందే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
అధిక రక్తపోటు లక్షణాలు..
తలనొప్పి
తల బరువుగా అనిపించడం
తల తిరగడం
ఆందోళన
కళ్లకు మసకగా కనిపించడం
అలసట
బీపీని నియంత్రించడానికి చిట్కాలు..
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
ఉప్పు తక్కువగా తీసుకోండి (రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ కాకూడదు).
జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాలను తగ్గించండి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి.
ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోండి.
రోజూ వ్యాయామం చేయండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News