కిడ్నీ స్టోన్స్ సహజంగా కరిగిపోవాలంటే ఏం చేయాలి?
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:29 PM
మూత్రపిండాల్లో రాళ్ళు పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారకముందే వాటికి చికిత్స చేయడం ఉత్తమం. అయితే, కిడ్నీలో రాళ్లను సహజంగా కరిగించడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కిడ్నీలో రాళ్లు చిన్నవిగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే, పెద్ద చికిత్సలు అవసరం లేకుండా సహజంగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో చాలా మందికి కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తక్కువ నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణాలు. కిడ్నీలో రాళ్లు పెద్దవిగా మారితే నడుము భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట, రక్తం రావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే రోజువారీ ఆహారం, అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకుంటే కిడ్నీ స్టోన్స్‌ను సహజంగా కరిగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ స్టోన్స్ సహజంగా కరిగిపోవాలంటే..
ఆహారంలో ఉప్పు ఎక్కువైతే, శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా ఎక్కువగా బయటకు వస్తుంది. అది కిడ్నీలో చేరి రాళ్లుగా మారుతుంది. రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు తగ్గిస్తే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
నీరు ఎక్కువగా తాగాలి: రోజూ సరిపడా నీరు తాగడం చాలా ముఖ్యం. కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగితే మూత్రం ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే నీరు సరిపడా తాగుతున్నారని అర్థం. ఇలా చేస్తే చిన్న రాళ్లు పెద్దవిగా మారకముందే బయటకు వెళ్లిపోతాయి.
సిట్రేస్ పండ్లు తినాలి: నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లు కిడ్నీ స్టోన్స్‌ను నివారిస్తాయి.
ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం చాలా మంచిది. రోజుకు అర కప్పు నిమ్మరసం నీటిలో కలిపి తాగవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. నీటిలో 2 టీస్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగవచ్చు.
తులసి ఆకుల రసం కూడా రాళ్లను కరిగించడంలో ఉపయోగపడుతుంది.
తులసి రసం, తేనె కలిపి రోజుకు 1 టీస్పూన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దానిమ్మ జ్యూప్, ముల్లంగి కూడా కిడ్నీ ఆరోగ్యానికి మంచివి.
ఏ ఆహారాలు తగ్గించాలి?
టమోటా, పాలకూర, బీట్‌రూట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించాలి.
రెడ్ మీట్, అధిక ప్రోటీన్ ఆహారాలు తగ్గించాలి.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.
చక్కెర కలిగిన శీతల పానీయాలు తాగకూడదు.
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి డైట్ ఎలా ఉండాలి?
ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్ మానేయాలి.
ఉప్పు, చక్కెర తక్కువగా తీసుకోవాలి.
రోజుకు కనీసం 9 గ్లాసుల నీరు తాగాలి.
తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.
ఇవన్నీ పాటిస్తే కిడ్నీ స్టోన్స్ సమస్యను చాలా వరకు సహజంగా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News