Share News

మీ పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? అసలు కారణం ఇదే..

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:25 PM

శీతాకాలంలో చాలామందికి పాదాలు చల్లగా అనిపిస్తాయి. వాతావరణం కారణంగానే ఇలా జరుగుతుందని చాలా మంది అస్సలు పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండటం ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

మీ పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? అసలు కారణం ఇదే..
Cold Feet Diabetes Symptoms

ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో పాదాలు చల్లబడటం సహజమే అని చాలా మంది భావిస్తారు. సాక్స్ వేసుకున్నా, మందపాటి దుప్పటి కప్పుకున్నా పాదాలు వేడెక్కకపోవచ్చు. చాలామంది దీన్ని సాధారణమే అని వదిలేస్తారు. కానీ ఎప్పుడూ ఇలా ఉండటం మాత్రం సాధారణం కాదు. కొన్నిసార్లు పాదాలు చల్లగా ఉండటం శరీరంలో జరుగుతున్న లోపాలకు సూచన కావచ్చు.


ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాదాలు చల్లగా ఉండటానికి రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ఒక ప్రధాన కారణం. పాదాలకు సరిపడా రక్తం చేరకపోతే అవి చల్లగా అనిపిస్తాయి.

దీనికి కారణాలు ఇవి కావచ్చు:

  • ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం

  • శారీరక చురుకుదనం లేకపోవడం

  • పొగ తాగడం

  • వయస్సు పెరగడం

చలికాలంలో రక్తనాళాలు కొంచెం కుచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ తగ్గి పాదాలు చల్లగా, కొద్దిగా నీలం రంగులో కనిపించవచ్చు. కొన్నిసార్లు తేలికపాటి నొప్పి లేదా తిమ్మిరి కూడా ఉంటుంది. కానీ నడవడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.


పాదాలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి?

  • పాదాలను వీలైనంత వెచ్చగా ఉంచుకోండి.

  • ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం లేదా నడక చేయండి.

  • ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దు.

  • రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోండి.

  • పొగ తాగడం మానేయండి.

  • పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 26 , 2026 | 06:09 PM