తగినంత నిద్రపోయినా తల ఎందుకు బరువుగా అనిపిస్తుంది?
ABN , Publish Date - Jan 26 , 2026 | 02:48 PM
చాలా మందికి బాగా నిద్రపోయిన తర్వాత కూడా తల బరువుగా, నీరసంగా అనిపిస్తుంది. దీనిని కొందరు సాధారణ అలసటగా భావిస్తారు. కానీ దీనికి వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా నిద్ర తర్వాత శరీరం, మనస్సు ఉత్సాహంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఉదయం లేవగానే అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. ఇది శరీరంలో జరుగుతున్న మార్పులకు సంకేతం కావచ్చు. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీనిని తేలికగా తీసుకోకూడదు.
కారణాలివే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం, రాత్రి ఎక్కువగా మొబైల్, టీవీ వంటి స్క్రీన్లు చూడటం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండటం, శరీరంలో నీటి లోపం(డీహైడ్రేషన్), సైనస్ సమస్యలు, హార్మోన్ల మార్పులు లేదా అసమతుల్య జీవన శైలి కారణాల వల్ల ఉదయం తల బరువుగా అనిపించవచ్చు.
తల బరువుగా ఉన్నప్పుడు కనిపించే ఇతర లక్షణాలు:
మగత(మత్తు)గా ఉండటం
తల తిరగడం
కళ్లలో మంట లేదా భారంగా అనిపించడం
ఏకాగ్రత లోపించడం
పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోవడం
చిరాకు, అసహనం
మెడనొప్పి లేదా తలనొప్పి
ఈ లక్షణాలు ఎక్కువకాలం ఉంటే ఆరోగ్య సమస్యకు సూచన కావచ్చు.
ఎలా తగ్గించుకోవచ్చు?
రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి నిద్ర లేవాలి.
పడుకునే ముందు మొబైల్, టీవీ వంటివి చూడకూడదు.
రోజంతా తగినంత నీరు తాగాలి.
తేలికపాటి, సమతుల్య ఆహారం తీసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించేందుకు యోగా లేదా ధ్యానం చేయాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News