Share News

బీన్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:03 PM

బీన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. బీన్స్ లోని డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీన్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Health Benefits of Beans

ఇంటర్నెట్ డెస్క్: బీన్స్ లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి ఆహారం. అందుకే వీటిని ‘సూపర్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. బీన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.


బరువు తగ్గడానికి సహకరిస్తాయి:

బీన్స్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తిన్నపుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

మధుమేహం నియంత్రణ:

బీన్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరగవు. డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం.

గుండె ఆరోగ్యం:

బీన్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తుంది.


క్యాన్సర్ నిరోధకం:

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా కొలొరెక్టల్ (పేగు) క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు

మెదడు చురుకుదనం:

బీన్స్‌లో ఉండే బి-విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యం:

వీటిలో ఉండే జింక్, బయోటిన్ చర్మం కాంతివంతంగా ఉండటానికి, జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడతాయి. మొటిమల సమస్యను కూడా దూరం చేస్తుంది.

శరీరంలోని వాపులను తగ్గిస్తాయి:

బీన్స్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలో అంతర్గత వాపులను తగ్గస్తాయి. తద్వారా కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 25 , 2026 | 03:24 PM