తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా? అసలు కారణం తెలుసుకోండి.!
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:09 PM
డైట్‌లో ఉన్నా లావు అవుతున్నారంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. జీవక్రియ నెమ్మదించటం, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మీరు చాలా తక్కువగా తింటున్నా బరువు పెరుగుతుంటే.. దాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకండి. ఇది శరీరంలో ఏదైనా సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా జీవక్రియ(మెటబాలిజం) నెమ్మదిగా ఉండటం వల్ల కూడా ఇలా జరగవచ్చు. చాలా మంది లావు అవుతామనే భయంతో తక్కువగా తింటుంటారు. చక్కెర, కొవ్వు పదార్థాలనూ తగ్గిస్తారు. అయినా బరువు తగ్గకుండా పెరుగుతూనే ఉంటే.. ఈ సమస్యకు తప్పకుండా కారణం తెలుసుకోవాలి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత చాలా మందిలో జీవక్రియ నెమ్మదిస్తుంది. అప్పుడు శరీరం కేలరీలను సరిగ్గా కరిగించలేకపోతుంది. తక్కువ తిన్నప్పటికీ కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల బరువు పెరుగుతుంది, ఊబకాయమూ వచ్చే అవకాశం ఉంటుంది.
హార్మోన్ల సమస్య..
తక్కువ తిన్నా బరువు పెరగడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా ప్రధాన కారణం. ఇది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS) రుతువిరతి(మోనోపాజ్), గర్భధారణ తర్వాత హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బరువు పెరగవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి.
సాధారణంగా కొంతమంది ఆహారం సరిగ్గా తీసుకోరు. అంటే వారు అవసరమైన దానికంటే తక్కువ తింటారు లేదా ఎక్కువసేపు ఆకలితో ఉంటారు. అలాంటి సందర్భాలలో శరీరం కొవ్వును కరిగించదు. కానీ దానిని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ రకమైన అలవాట్లు బరువు పెరగడానికి దారితీస్తాయి. అలాగే స్టెరాయిడ్ మందులు తీసుకునే వారిలో ఈ రకమైన సమస్య కనిపిస్తుంది.
బరువు పెరగకుండా ఉండాలంటే..
సమతుల్య ఆహారం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ తినకండి.
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.
7-8 గంటలు నిద్రపోండి.
మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయండి.
ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది, ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News