అలసట తగ్గాలంటే వీటిని తినండి.. ఫుల్ యాక్టివ్ అవుతారు.!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:11 PM
ఉదయం లేచినప్పటి నుంచే అలసటగా అనిపిస్తోందా? చిన్న పని చేసినా నీరసంగా ఉందా? సరైన ఆహారం తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలసట తగ్గి శరీరం ఫుల్ యాక్టివ్‌గా మారాలంటే ఏం తినాలనే వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో అలసట, నీరసం చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఉదయం లేచినప్పటి నుంచే బద్దకంగా అనిపించడం, చిన్న పని చేసినా అలసిపోవడం, రోజంతా ఉత్సాహంగా లేకపోవడం.. ఇవన్నీ సాధారణమైపోయాయి. అయితే అలసట ఎందుకు వస్తుంది? అలసట తగ్గాలంటే ఏం తినాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అలసట(Fatigue) అనేది సరిపడా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అలాగే తక్కువ నీరు తాగడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వంటి జీవనశైలి సమస్యల వల్ల కూడా రావచ్చు. ఇవన్నీ శరీర శక్తిని తగ్గిస్తాయి. అంతేకాకుండా.. రక్తహీనత(Iron Deficiency), విటమిన్ లోపాలు(B12, D, Folate), డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు, కొన్ని మందుల వాడకం, దీర్ఘకాలిక వ్యాధులు, అధిక పనిభారం లేదా శారీరక శ్రమ వంటి కారణాల వల్ల కూడా వస్తుంది. అయితే సరైన ఆహారం తీసుకుంటే అలసట తగ్గి శరీరం ఫుల్ యాక్టివ్‌గా మారుతుంది.
అలసట తగ్గాలంటే ఇవి తినండి.!
అరటిపండులో సహజ చక్కెర, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తినిస్తాయి. ఉదయం లేదా వ్యాయామానికి ముందు అరటిపండు తింటే అలసట త్వరగా తగ్గుతుంది.
ఖర్జూరం: తక్షణ శక్తి కావాలంటే ఖర్జూరం బెస్ట్. ఇందులో గ్లూకోజ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. 2-3 ఖర్జూరాలు తింటే శరీరం యాక్టివ్‌గా మారుతుంది.
గుడ్లు: గుడ్లు ప్రోటీన్‌కు మంచి వనరు. ఇవి కండరాలను బలంగా చేసి రోజంతా శక్తిని నిలబెట్టడంలో సాయపడతాయి. ఉదయం గుడ్డు తింటే అలసట తగ్గుతుంది.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్నట్, జీడిపప్పు లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ ఉదయం 4-5 నానబెట్టిన బాదం తింటే ఉత్సాహం పెరుగుతుంది.
పెరుగు: పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఉదర సమస్యల వల్ల వచ్చే అలసటను తగ్గిస్తాయి.
ఆకుకూరలు: ఇవి ఐరన్, ఫోలేట్‌తో నిండి ఉంటాయి. రక్తహీనత వల్ల వచ్చే అలసటను తగ్గించడంలో చక్కగా ఉపయోగపడతాయి.
ఓట్స్: నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారం ఓట్స్. ఉదయం అల్పాహారంగా తింటే ఎక్కువసేపు యాక్టివ్‌గా ఉంటారు.
అలసటను తగ్గించుకోవాలంటే మందుల కంటే ముందుగా ఆహారంపై దృష్టి పెట్టాలి. సరైన పోషకాలున్న ఆహారం తీసుకుంటే శరీరం సహజంగానే ఫుల్ యాక్టివ్‌గా మారుతుంది. అలాగే రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి. తగినంత నీరు తాగాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినకూడదు. రోజూ కనీసం కొద్దిసేపైనా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News