చికెన్ లేదా మటన్.. గుండె ఆరోగ్యానికి ఏది మంచిది?
ABN , Publish Date - Jan 24 , 2026 | 07:24 PM
చాలా మంది చికెన్, మటన్ రెండింటినీ ఇష్టపడతారు. అయితే తమ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలియక గుండె సమస్యలు ఉన్నవారు అయోమయంలో పడతారు. గుండె ఆరోగ్యానికి ఏ మాంసం మంచిదో మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మాంసాహారం తినేవారిలో చికెన్ తినాలా? మటన్ తినాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఏది మంచిదో వైద్యుల అభిప్రాయం తెలుసుకుందాం..
చికెన్..
చాలా మంది చికెన్, మటన్ రెండింటినీ ఇష్టపడతారు. రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది. కానీ కొవ్వు శాతం, పోషకాల పరంగా రెండింటికీ తేడా ఉంది. చికెన్‌లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్‌లో దాదాపు 30 - 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే జిమ్‌కి వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా చికెన్‌ను ఎంచుకుంటారు. చికెన్‌లో బి విటమిన్లు ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ ఫ్రైడ్ చికెన్, ప్రాసెస్ చేసిన చికెన్ ఐటమ్స్‌లో కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఆరోగ్యానికి హానికరం.
మటన్..
మటన్‌లో ప్రోటీన్‌తో పాటు ఐరన్, జింక్, విటమిన్ B12 వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మటన్‌లో సుమారు 25 - 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి కొంత ఉపయోగకరం. అయితే మటన్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే మటన్‌ను తరచుగా లేదా అధికంగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి ఏది మంచిది?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. గుండె సమస్యలతో బాధపడేవారు చికెన్‌ను మితంగా తినడం మంచిది. అలాగే చేపలు(ఫిష్) గుండె ఆరోగ్యానికి మరింత మంచివని వైద్యులు సూచిస్తున్నారు. మటన్‌కు దూరంగా ఉండటం ఉత్తమని సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News