కాళ్ల వాపు వస్తే తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:13 PM
శరీరంలో అదనపు ద్రవాలు పేరుకుపోవడం వల్ల తరుచూ కాళ్ల వాపులు వస్తుంటాయి. కాళ్ల వాపు తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటూ సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా కాళ్ల వాపు (Edema) అనేది శరీరంలోని అదనపు ద్రవాలు పేరుకుపోవడం వల్ల వస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం. ముఖ్యంగా శరీరంలోని సోడియం(ఉప్పు) శాతాన్ని తగ్గించి, పొటాషియం శాతాన్ని పెంచే ఆహారం తీసుకోవడం మంచిది. కాళ్ల వాపు తగ్గడానికి మనం తినాల్సిన ఆహారం ఏంటో చూద్దాం.
1. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం:
శరీరంలో సోడియం బ్యాలెన్స్ చేయడానికి పొటాషియం ఎంతో అవసరం. ఇది ఎలాంటి వాపులనైనా తగ్గిస్తుంది. అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. చిలకడదుంప (Sweet Potato) శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. బచ్చలికూరలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
2. మెగ్నీషియం అధికంగా ఉండే పదార్థాలు:
మెగ్నీషియం లోపం వల్ల కూడా నీరు పేరుకుపోయి కాళ్ల వాపులు వస్తాయి. బాదం, వాల్‌నట్స్ రోజుకు 4-5 తీసుకుంటే ఎంతో మంచిది. ఓట్స్, జొన్నలు వంటివి తినడం వల్ల కాళ్ల వాపులు తగ్గే అవకాశం ఉంటుంది.
3.సహజమై డయూరిటిక్స్:
దోసకాయలో నీటి శాతం ఎక్కువ. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ కూడా వాపును తగ్గిస్తుంది. మూత్ర విసర్జను పెంచి.. శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని, ఉప్పును బయటకు పంపిస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల విషతుల్యాలు బయటకుపోతాయి.
4: స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి:
ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రకంగా స్ట్రీట్ ఫుడ్ తినే అలవాటు ఉన్నవాళ్లకు రకరకాల రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటివి తినడం వల్ల కాళ్ల వాపులు వచ్చే ఛాన్స్ ఉంది. వీటికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
5. కాళ్లను ఎత్తులో ఉంచండి:
పడుకునే ముందు లేదా కూర్చునప్పుడు మీ కాళ్ల కింద 2-3 దిండ్లు పెట్టుకుని, కాళ్లు మీ గుండె మట్టం కంటే కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News