కళ్లలో తరచూ నీరు కారుతోందా? కారణాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:26 PM
కళ్లలో తరచూ నీరు కారడానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసా? తరచూ నీరు కారడం ఏదైనా వ్యాధికి సంకేతం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి తరచూ కళ్లలో నీరు కారే సమస్య ఉంటుంది. చాలా మంది దీన్ని చిన్న సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి కళ్ల నుంచి తరచూ నీరు కారితే నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
దుమ్ము, పొగ, గాలి, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగించడం వల్ల కళ్లలో చికాకు కలిగి నీరు కారవచ్చు. అయితే ఈ సమస్య తరచూ లేదా ఎక్కువ కాలం కొనసాగితే.. అది అలెర్జీ, ఇన్ఫెక్షన్ లేదా ఇతర కంటి సమస్యలకు కారణం కావొచ్చు.
కళ్లలో తరచూ నీరు కారడానికి కారణాలు
కళ్ల నుంచి ఎక్కువగా నీరు కారడానికి అనేక కారణాలు ఉన్నాయి:
అలెర్జీలు: దుమ్ము, పొగ వల్ల కళ్ళలో దురద, ఎరుపు, నీరు కారడం జరుగుతుంది.
కంటి ఇన్ఫెక్షన్: బ్యాక్టీరియా లేదా వైరస్ కారణంగా కళ్లు ఎర్రగా మారి నీరు కారవచ్చు.
పొడి కళ్లు (డ్రై ఐస్): కళ్లు పొడిగా మారినప్పుడు శరీరం ఎక్కువ కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది.
కన్నీటి నాళాల్లో అడ్డంకులు: కన్నీటి నాళాలు మూసుకుపోతే కళ్లలో నీరు నిల్వ ఉంటుంది.
సైనస్ సమస్యలు: సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లలో నీరు కారవచ్చు.
వయస్సు పెరగడం: వృద్ధాప్యం కారణంగా కూడా కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
అధిక స్క్రీన్ వినియోగం: మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి.
కళ్లలో నీరు కారకుండా ఎలా నివారించాలి?
కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి:
కళ్లను తరచూ రుద్దకూడదు.
దుమ్ము, పొగ నుంచి కళ్లను రక్షించుకోండి.
మొబైల్, కంప్యూటర్ వాడేటప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి.
మురికి చేతులతో కళ్లను తాకవద్దు.
చల్లటి నీటితో కళ్లను కడుక్కోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే స్వీయ వైద్యం చేయకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News