211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారి స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను మాత్రమే ఎన్నికల అధికారి ఖరారు చేశారు.
లాలూతో సమావేశానంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, బిహార్‌లో 243 సీట్లు ఉన్నాయని, 5 నుంచి 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అన్నారు. 'ఇండియా' కూటమి పూర్తి ఐక్యమత్యం, పూర్తి శక్తిసామర్థ్యాలతో పోటీకి సిద్ధంగా ఉందన్నారు.
జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.
శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్ నివాసిగా పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.
బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.
నితీష్ ఆరోగ్యంపై తేజస్వి కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో నితీష్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్‌లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ నితీష్ ఉండిపోయారు.
నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్‌ను బీజేపీ అమలు చేయాలనుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు
శశి భూషణ్ సింగ్ డీసీఎల్ఆర్ కార్యాలయంలో సోమవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ అసంపూర్తిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీపీఐ వంటి అన్‌రిజిస్టర్డ్ పార్టీల నుంచి 10 మంది ప్రపోజర్లు నామినేషన్ దాఖలుకు అవసరం.