Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 81 నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:46 AM
211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారి స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను మాత్రమే ఎన్నికల అధికారి ఖరారు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక (Jubilee Hills bypoll) నామినేషన్ల స్క్రూటినీ పూర్తి అయ్యింది. దాదాపు 17 గంటల పాటు స్క్రూటినీ ప్రక్రియ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారులు స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 135 నామినేషన్లకు మాత్రమే రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు రేపు (శుక్రవారం) చివరి తేదీగా అధికారులు తెలిపారు.
నామినేషన్లు ముగిసిన తర్వాత స్క్రూటినీ ప్రక్రియ మొదలైంది. దాదాపు 17 గంటల పాటు స్క్రూటినీ సాగగా.. 81 మంది అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రేపటితో నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉండటంతో... చాలా మంది విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్ నియోజకవర్గ ఉపఎన్నికల బరిలో ఎంత మంది ఉండబోతున్నారనే దానిపై రేపు సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
ఇక.. ఆగస్టు 13 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈనెల 21 వరకు కొనసాగింది. నామినేషన్లలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రికార్డు సృష్టించింది. చివరి రోజు 170కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు, నిరుద్యోగ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కచ్చితంగా బరిలో ఉంటామని.. కాంగ్రెస్‌తో ధీటుగా పోరాడుతామని వారు స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాన అభ్యర్థులైన బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ల విషయంలో కాస్త గందరగోళం నెలకొన్నప్పటికీ... చివరకి స్క్రూటినీ విషయంలో ఈ ముగ్గురి నామినేషన్లకు ఆమోదం లభించడంతో వివాదానికి తెరపడింది. కాగా.. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగనుండగా... నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితం వెల్లడి కానుంది.
ఇవి కూడా చదవండి..
పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News