Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇన్ని నామినేషన్లా..? ఎందుకిలా..?
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:24 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. మరికొద్ది రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ..
హైదరాబాద్, అక్టోబర్ 24: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. మరికొద్ది రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు దాదాపు 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు వేశారు. అయితే, వీరిలో 81 మంది వేసిన 135 నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ.. పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉండటంతో.. ఈ ఎన్నిక మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.
డబ్బులా..? డోంట్ కేర్..!
సాధారణంగానే ఎన్నికలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా పోటీ చేయాలంటేనే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఎమ్మెల్యేగా పోటీ అంటే ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం ఎన్నికల ఖర్చుకు లిమిట్ ఉంటుంది. కొంత మొత్తమే ఖర్చు చేయాలని నిబంధనలు ఉంటాయి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అంతెందుకు.. ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలన్నా కనీసం రూ. 10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎమ్మెల్యే ఎన్నిక ఇంతటి వ్యయంతో కూడుకున్నదైనప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. 321 మంది నామినేషన్లు వేశారంటే అభ్యర్థులంతా ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎందుకింత ఆసక్తి..?
వాస్తవానికి ఇది ఉప ఎన్నిక అయినప్పటికీ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు చాలా ఇంట్రస్ట్ చూపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే మూడేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇందులోనూ ఎలక్షన్ ఇయర్ వచ్చిందంటే రాజకీయాలు షరామామూలే. అయినప్పటికీ.. ప్రధాన పార్టీలు మొదలు ఇండిపెండెంట్ అభ్యర్థుల వరకు ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. అయితే, ఇక్కడ మరో కీలక విషయం కూడా ఉందండోయ్. రాజకీయాలపై ఆసక్తితో కొందరు నామినేషన్ వేస్తే.. ప్రభుత్వం ఆగ్రహంతో మరికొందరు నామినేషన్లు వేశారు. అవును.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ కొందరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో నామినేషన్ వేశారు. ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు, నిరుద్యోగ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. కచ్చితంగా బరిలో ఉంటామని.. కాంగ్రెస్‌తో ధీటుగా పోరాడుతామని వారు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు వచ్చాయి.
Also Read:
Kurnool Bus Fire Accident: 'బస్సులో అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి'.. ప్రత్యక్ష్య సాక్షి ఆవేదన
Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్