Share News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:18 AM

జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్
Jubilee Hills Bypoll

హైదరాబాద్, అక్టోబర్ 22: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills Bypoll) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) దృష్టిసారించారు. గులాబీ పార్టీ ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రేపు (గురువారం) ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉప‌ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్‌ఎస్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా.. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్ పార్టీ. అందుకు తగ్గ ప్రణాళిలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడిక్కడ ర్యాలీలో, సభలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.


మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. బైపోల్‌లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టంకట్టనున్నారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి...

బకాయిలు అడిగితే బ్లాక్ మెయిలా.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం

దారుణం.. కొడుకు చేతిలో తండ్రి హతం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 05:34 PM