Hyderabad: దారుణం.. కొడుకు చేతిలో తండ్రి హతం
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:53 AM
మద్యం కారణంగా మరోకరి ఉసురు పోయింది. అతిగా మద్యం తాగిన కన్నతండ్రి, కుమారుడి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో కన్న కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు.
హైదరాబాద్, అక్టోబర్ 22: మద్యం మత్తులో కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్.. తన కుమారుడు షేక్ సాతక్‌తోపాటు అతడి స్నేహితుడితో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం ఆ మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య మాటమాట పెరిగింది. దీంతో వారిద్దరు ఘర్షణకు దిగారు. పక్కనే ఉన్న బండరాయి తీసుకుని.. కన్నతండ్రిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు షేక్ సాతక్‌తోపాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక నిజాముద్దీన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి అమ్మకాలు రూ 6 లక్షల కోట్లు
For More TG News And Telugu News