Share News

Diwali Sales Retail Market Growth: దీపావళి అమ్మకాలు రూ 6 లక్షల కోట్లు

ABN , Publish Date - Oct 22 , 2025 | 02:07 AM

ఈ ఏడాది దీపావళి రిటైల్‌ రంగానికి బాగానే కలిసొచ్చింది. ఈ పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.6.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువని...

Diwali Sales Retail Market Growth: దీపావళి అమ్మకాలు రూ 6 లక్షల కోట్లు

రికార్డు స్థాయిలో విక్రయాలు

50 లక్షల తాత్కాలిక కొలువులు సీఏఐటీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళి రిటైల్‌ రంగానికి బాగానే కలిసొచ్చింది. ఈ పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.6.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. దీనికి తోడు 50 లక్షల తాత్కాలిక కొలువులూ ఏర్పడ్డాయి. ఈ ఏడాది దీపావళికి నమోదైన రూ.6.05 లక్షల కోట్ల అమ్మకాల్లో 75 శాతం అమ్మకాలు నాన్‌-కార్పొరేట్‌, సంప్రదాయ మార్కెట్ల నుంచి నమోదైంది. మళ్లీ ఇందులో రూ.5.4 లక్షల కోట్లు వస్తువుల అమ్మకాల ద్వారా, రూ.65,000 కోట్లు సేవల ద్వారా నమోదైనట్టు సీఏఐటీ తెలిపింది. రాష్ట్రాల రాజధానులు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 60 ప్రధాన పంపిణీ కేంద్రాల కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు పేర్కొంది.

జీఎ్‌సటీతో బూస్ట్‌: ప్రభుత్వం జీఎ్‌సటీ రేట్లను కుదించడం ఈ సంవత్సరం దీపావళి అమ్మకాలకు బాగా దోహదం చేసినట్టు 72 శాతం మంది వ్యాపారులు వెల్లడించటం విశేషం. జీఎ్‌సటీ తగ్గింపుతో ఈ ఏడాది నిత్యావసరాలు, పాదరక్షలు, దుస్తులు, మిఠాయిలు, గృహాలంకరణ, వినియోగ వస్తువులు బాగా అమ్ముడుపోయాయి. ఈ అమ్మకాల జోరు ఈ ఏడాది చలి కాలం, పెళ్లిళ్ల సీజన్‌, సంక్రాతి, ఉగాది, శ్రీరామనవమి వరకు కొనసాగుతుందని సీఏఐటీ అంచనా. ఈ ఏడాది దీపావళికి నమోదైన రూ.6.05 లక్షల కోట్ల అమ్మకాల్లో 28 శాతం అమ్మకాలు గ్రామీణ, సెమీ అర్భన్‌ ప్రాంతాల నుంచి నమోదవడం విశేషం.


ఈ-కామర్స్‌దీ అదే బాట

ఈ దీపావళి ఈ-కామర్స్‌ దిగ్గజాలకూ బాగానే కలిసొచ్చింది. గత ఏడాది దీపావళితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి ఈ సంస్థల అమ్మకాల పరిమాణం 24 శాతం పెరిగింది. విలువపరంగా చూసినా 23 శాతం వృద్ధి రేటు నమోదైందని యూనికామర్స్‌ అనే సంస్థ తెలిపింది. ఇదే సమయంలో క్విక్‌ కామర్స్‌ కంపెనీల ఆర్డర్ల పరిమాణమైతే 120 శాతం పెరిగింది. బ్రాండ్‌ వెబ్‌సైట్ల అమ్మకాల్లోనూ 33 శాతం వృద్ధి రేటు కనిపించింది. ఈ దీపావళికి నమోదైన 15 కోట్ల ఆన్‌లైన్‌ ఆర్డర్లను పరిశీలించి యూనికామర్స్‌ సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది.

లక్ష కార్ల డెలివరీ

టాటా మోటార్స్‌

ఈ పండగల సీజన్‌ టాటా మోటార్స్‌కీ బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది దసరా నవరాత్రుల నుంచి దీపావళి వరకు లక్షకు పైగా కార్లను కొనుగోలుదారులకు డెలివరీ ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువని తెలిపింది. ఇందులో ఎస్‌యూవీలే 38,000 వరకు ఉన్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం

Updated Date - Oct 22 , 2025 | 02:07 AM