Share News

Kurnool Bus Fire Accident: 'బస్సులో అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి'.. ప్రత్యక్ష్య సాక్షి ఆవేదన

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:09 PM

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు ఎక్కడికక్కడ పూర్తిగా కాలిపోయింది. భగ్గున చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళ హైమారెడ్డి.. ఆ దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Kurnool Bus Fire Accident: 'బస్సులో అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి'.. ప్రత్యక్ష్య సాక్షి ఆవేదన
Kurnool Bus Fire Accident

అమరావతి, అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ తెల్లవారుజామున బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు ఎక్కడికక్కడ పూర్తిగా కాలిపోయింది. భగ్గున చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళ హైమారెడ్డి.. ఆ దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

'నా పేరు హైమా. నేను పుట్టపర్తికి వెళ్లి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైంది అని మా డ్రైవర్‌ని అడగగా.. బస్సు కాలిపోతుందని చెప్పాడు. నేను హెల్ప్ చేద్దామని గబగబా కారునుంచి దిగాను. దగ్గరికి వెళ్లే సరికి బస్సు తగలబడిపోతోంది. కొంత మంది కింద కూర్చొని ఏడుస్తున్నారు. బస్సునుండి బయటికి వచ్చినవాళ్ల దగ్గర ఏమీ లేవు. ఆ బస్సుల్లో వాళ్ళ లగేజీ అంతా కాలిపోయింది. బస్సు తగలబడి పోతుంటే మిగిలిన జనం మొబైల్స్‌తో వీడియో తీసుకుంటున్నారు. ఎవరూ పోలీస్‌కి కాల్ చేయలేదు. నేను హడావిడిలో నా ఫోన్‌ని కార్‌లోనే వదిలేశాను. ఒక పక్క వర్షం పడుతోంది. ఎవరి ఫోన్ అయినా తీసుకొని హెల్ప్ చేద్దామని అనుకున్నా కుదరలేదు. నేను వేంటనే గబగబా కారుదగ్గరికి వెళ్లి, ఫోన్ తీసుకుని కర్నూల్ ఎస్పీకి కాల్ చేశాను. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యారు. కాసేపటికే రురల్ ఎస్సై బృందం వచ్చింది. వీళ్ళకంటే ముందే ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చింది. ఆ వెంటనే అంబులెన్స్ వచ్చింది. అప్పటికే ఒక ప్రైవేట్ వాహనంలో ఒక ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. నాతో ఉన్న ధర్మవరానికి చెందిన హరీశ్.. ఆరుగురు క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. తరువాత ఒక ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై, పోలీసులు అందరూ అక్కడికి వచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధం అయింది. బస్సులో మాంసపు ముద్దలు కాదు.. చాలా దారుణ పరిస్థితి ఉంది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి నా వల్ల కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. నేను తట్టుకోలేక పోయాను. వస్తూ వస్తూ మార్గమధ్యంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునిగి స్నానం చేశాను. నిజంగా ఈ ఘటన చాలా బాధాకరం. ఎవరినీ కాపాడటానికి అక్కడ అవకాశం లేదు. పోలీసులు సమాయానికి రాకపోయుంటే చాలా కష్టంగా ఉండేది. పోలీసులు , ఫైర్ సిబ్బంది మంటలను ఆపేశారు. బస్సు కిందనే బైక్ ఉండిపోయింది. బైక్ ని బస్సు ఢీ కొంటే బైక్ పైనుండి వ్యక్తి ఎగిరిపడి రోడ్డు పక్కన పడిపోయాడు' అని ఆమె వివరించారు.


హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత ఆ బైకు బస్సు కిందికి వెళ్లి డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అంతా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు . నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) సజీవ దహహం అయ్యారు. బెంగళూరులో రమేష్ కుటుంబం స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో వీరు మృతి చేశారు. మృతుల, బాధితుల కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


ఈ ప్రమాదంలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైనట్లు ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయన్నారు. తీవ్రంగా కలిచివేస్తున్న ఈ ఘటనపై 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సులో ఉన్న 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీకి చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఆరుగురు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, ఒడిశాలో ఒకరు, బిహార్ కలో ఒకరు, ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే కమిటీ కూడా వేస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Jubilee Hills Congress: జూబ్లీహిల్స్‌ ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Updated Date - Oct 24 , 2025 | 06:39 PM