Jubilee Hills Congress: జూబ్లీహిల్స్ ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:01 PM
శనివారం నుంచి జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయాలని కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఆసక్తి కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం ముగియటంతో పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్‌లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. డివిజన్లలో క్షేత్రస్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తూ.. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని ప్రచారంపై అధికార పార్టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రేపటి(శనివారం) నుంచి జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయాలని నాయకులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రతి మంత్రికి సహాయకులుగా నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు కార్పొరేషన్ ఛైర్మన్లు ఉండనున్నారు. ప్రతి బూత్ బాధ్యతను జిల్లాస్థాయి నేతకు అప్పగించినట్లు టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ప్రతిరోజూ చేసిన ప్రచార కార్యక్రమాలను గాంధీ భవన్ వార్ రూమ్‌కు పంపాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్.. 14న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News