Bihar Elections: శ్వేతా సుమన్ ఔట్.. మహాఘట్‌బంధన్‌కు దెబ్బ మీద దెబ్బ
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:40 PM
శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్ నివాసిగా పేర్కొన్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) విపక్ష మహాఘట్‌బంధన్ (INDI Alliance)కు మరో గట్టి దెబ్బ తగలింది. కైమూర్ మోహనియా (Kaimur Mohania) నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఆర్జేడీ (RJD) అభ్యర్థి శ్వేతా సుమన్ (Shweta Suman) నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్ నివాసిగా పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్‌ను మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.
దీనికి ముందు ఈస్ట్ చంపరాన్‌లోని సుగౌలి నియోజకవర్గం నుంచి కూడా విపక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక కారణాలతో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) అభ్యర్థి శశి భూషణ్ సింగ్ నామినేషన్‌ను ఈసీ తోసిపుచ్చింది. వీఐపీ రిజిస్టర్ చేసిన ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో ఆయన నామినేషన్‌కు 10 మంది ప్రపోజర్లు అవసరం. అయితే ఆర్జేడీ నిబంధలన నేపథ్యంలో ఒక్క ప్రపోజర్ పేరునే ఆయన సమర్పించారు. దాంతో ఆయన అభ్యర్థిత్వాన్ని అనర్హమైనదిగా ఈసీ ప్రకటించింది. కాగా, ఆర్జేడీ రెబల్ అభ్యర్థి ఓం ప్రకాష్ చౌదరి నామినేషన్ కూడా చెల్లలేదు. ఆయన నామినేషన్ పేపర్‌లో పలు ఖాళీలు ఉండటంతో నామినేషన్ చెల్లలేదు. మహాఘట్‌బంధన్‌లో సంస్థాగత లోపాలకు ఈ పరిణామాలు అద్దంపట్టినట్టు చెబుతున్నారు.
తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల దాఖలు గడువు అక్టోబర్ 17వ తేదీతో ముగియగా, రెండో విడత పోలింగ్‌కు నామినేషన్ల దాఖలు గడవు ఈనెల 20తో ముగిసింది. 243మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి