PM Modi: లాంతర్లు అవసరం లేదు, మొబైల్స్‌లో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి: ఆర్జేడీకి మోదీ చురకలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:47 PM
ఆర్జేడీ జంగిల్ రాజ్‌కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని మోదీ అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి పోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చిందే లేదని విమర్శించారు.
బెగుసరాయ్: జంగిల్ రాజ్ (Jungle raj) నేతలకు తమ కుటుంబాల పట్లే శ్రద్ధని, బిహార్ యువత జీవితాలను నాశనం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే బిహార్‌ను అభ్యుదయ పథంలోకి నడిపించిందని చెప్పారు. బిహార్‌లోని నమస్తీపూర్ జిల్లా కర్పూరీ గ్రామం నుంచి శుక్రవారం నాడు ఎన్నిక ప్రచారం ప్రారంభించిన ప్రధాని ఆ తర్వాత రెండో ర్యాలీగా బెగుసరాయ్ (Begusarai) ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు లాంతర్ (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదని, ఇప్పుడు వారి మొబైల్స్‌లో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయని అన్నారు. బిహార్ యువత వలసలు వెళ్లడానికి ఆర్జేడీనే కారణమని విమర్శించారు. ఆర్జేడీ జంగిల్ రాజ్‌కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచి పారిపోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ఆర్జేడీ అహంకారంతోనే..
ఆర్జేడీ అహంకారం వల్లే జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం.. మహూఘట్ బంధన్‌కు స్వస్తి చెప్పందని, తమ అభ్యర్థులు ఆరుగురిని ఉపసంహరించుకుందని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాలుగా ఆర్జేడీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని, అయినప్పటికీ అహంకారం తగ్గలేదని, జేఎంఎంను కూటమి నుంచి విసిరిపారేసిందని ఎద్దేవా చేశారు. బిహార్‌లో ఆర్జేడీతో 35 ఏళ్లుగా కాంగ్రెస్ అంటకాగుతోందన్నారు. వాళ్లు చివరకు వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీని సైతం స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టించారని అన్నారు. 'వాళ్లు ముందు టికెట్లు అమ్ముకుంటారు. ఆ తర్వాత స్కామ్‌లు చేస్తారు' అని విమర్శలు గుప్పించారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
సర్‌కు సన్నాహాలు చేయండి
తమ కూటమిలోకి విజయ్ వస్తే స్వాగతిస్తాం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి