Share News

BJP State President: తమ కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం..

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:40 PM

తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు.

BJP State President: తమ కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం..

- బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆహ్వానం

చెన్నై: తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌(BJP State Presiden, MLA Nayanar Nagendran) పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 28న కోవైలో పర్యటించి కొడిసియాలో నిర్వహించనున్న పారిశ్రామికవేత్తల మహానాడులో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతికి కోవై విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ తరుఫున నాగేంద్రన్‌ ఘన స్వాగతం పలుకనున్నారు.


ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు నయినార్‌ నాగేంద్రన్‌ గురువారం కోవై వెళ్లారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. డెల్టాలో సుమారు 12లక్షల హెక్టార్ల భూములు నీటమునిగాయని, ఈ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు వానలో తడిస్తున్నాయని, అయినా రాష్ట్రప్రభుత్వం దీనిపై స్పందించకపోవడ దారుణమన్నారు. ఈశాన్యాన్ని ఎదుర్కొనేందుకు వర్షానికి ముందే కేంద్రప్రభుత్వం తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వానికి రూ.250కోట్లను విడుదల చేసిందని తెలిపారు.

nani2.jpg


ధాన్యం కొనుగోలుపై శ్వేతపత్రం....

ధాన్య్యం కొనుగోలుపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నాగేంద్రన్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నిల్వవుండటానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆహారశాఖ మంత్రి చక్రపాణి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2025-26వ ఆర్ధిక సంవత్సరంలో రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యంతో నాణ్యమైన బియ్యం కలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం జూలై 28వ తేదీనే రాష్ట్రప్రభుత్వానికి పంపించిందని, అయితే మంత్రి చక్రపాణి వాస్తవాలను మరుగుపరిచి రైతులను మభ్యపెట్టేందుకు కేంద్రప్రభుత్వంపై బురదచల్లేలా వ్యాఖ్యానించారని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 12:40 PM