Bihar Elections: మా హయాంలో డిప్యూటీ సీఎంలకు కొదవుండదు.. తేజస్వి యాదవ్
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:31 PM
బిహార్‌లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.
పాట్నా: బిహార్‌లో మహాఘట్‌బంధన్ (Mahagathbandhan) అధికారంలోకి రాగానే వివిధ సామాజిక వర్గాల నుంచి మరింత మంది ఉప ముఖ్యమంత్రులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) తెలిపారు. విపక్ష కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రిగా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) అధినేత ముఖేష్ సాహ్నీ పేర్లను కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ప్రకటించారు.
బిహార్‌లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.
ఆసక్తికరంగా ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 40 సీట్లు ఇవ్వాలని ముఖేష్ సాహ్నీ పట్టుబట్టారు. అయితే ఇందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ విముఖత చూపించాయి. మహాకూటమి అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని సాహ్నికి భరోసా ఇచ్చాయి. దీంతో సాహ్ని పార్టీ 15 సీట్లతో సరిబెట్టుకుంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సాహ్నీ పార్టీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. అప్పుడు వీఐపీకి 11 సీట్లు ఇవ్వగా, నాలుగు సీట్లు గెలిచింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోగా, ఒకరు కన్నుమూశారు. రెండు విడతల బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6,11 తేదీల్లో జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్
ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి