Share News

TVK Vijay: మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:19 PM

‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్‌ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.

TVK Vijay:  మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్‌

- వచ్చే వారం నుంచి ప్రారంభం?

- రోడ్‌షోలకు స్వస్తి.. మైదానాల్లోనే సభలు!

చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌(Vijay) మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్‌ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 27వ తేదీన విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.


nani2.2.jpg

దీంతో ఆయన రాష్ట్ర పర్యటన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తాను నిలిపివేసిన పర్యటన మళ్ళీ ప్రారంభించేందుకు విజయ్‌ సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ ఒకటి రెండు రోజుల్లో వెల్లడికావచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో ప్రజల భద్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు విజయ్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా రోడ్‌షోలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.


nani2.3.jpg

ఇకపై విశాలమైన మైదానాల్లోనే సభలు నిర్వహించాలని విజయ్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చెన్నై(Chennai) నుంచి ఆయా సభా ప్రాంగణాలకు హెలిక్యాప్టర్‌లో వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని టీవీకే వర్గాలు తెలిపాయి. ప్రజల రద్దీ, వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తన ప్రచారాన్ని కొనసాగించేలా టీవీకే పక్కా ప్రణాళికను ఖరారు చేస్తున్నట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 12:19 PM